Begin typing your search above and press return to search.
టచ్ చేస్తే జైలే.. చట్టం ఏం చెబుతోంది?
By: Tupaki Desk | 16 Oct 2018 6:27 AM GMTమీటూ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. ఇదే చర్చ. పేపర్లు మొదలుకొని న్యూస్ ఛానళ్ల వరకూ మీటూకు సంబంధించి ఏదో ఒక వ్యవహారం ఇప్పుడు హెడ్ లైన్స్ లో కనిపించే పరిస్థితి. అక్కడెక్కడో హాలీవుడ్‌లో వేధింపు పర్వంపై తిరుగుబాటు అంతకంతకూ విస్తరిస్తూ.. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది.
సామాన్యుల సంగతిని పక్కన పెడితే.. ప్రముఖులు పలువురు గతంలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఇన్నాళ్లు తమ గుండెల్లో దాచుకున్న దాన్ని బయటకు చెప్పేస్తున్నారు. తమ ఎదురైన వేధింపులను ఓపెన్ గా చెప్పేయటమే కాకుండా.. తమను ఇబ్బంది పెట్టిన పెద్ద మనుషుల పేర్లను చెప్పేస్తున్నారు. ఇలాంటి వేళ.. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణగా నిలిచే చట్టం ఏమిటి? అదెంత కరకుగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పని ప్రదేశంలో ఎవరైనా అవాంఛనీయమైన టచ్ మాత్రమే కాదు.. మాటలైనా.. సైగలైనా శిక్షార్హమేనన్న విషయాన్ని తాజాగా స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 1997లో మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాన్ని తర్వాతి కాలంలో రద్దు చేసి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు.
ఐపీసీ సెక్షన్ 354 కింద మహిళల వేధింపు నేరాలకు పాల్పడే వారికి విధించే శిక్షలను ఈ సెక్షన్ స్పష్టం చేస్తోంది. పది మంది కంటే ఎక్కువ మంది పని చేసే కార్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారించేందుకు ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలి. ఇందులో కనీసం నలుగురు సభ్యులు ఉండాలి. వారిలో ఇద్దరు మహిళలు ఉండాలి. ఇంతకీ.. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు అంటే..
+ శారీరక సంబంధాలు పెట్టుకోవడం
+ కోరిక తీర్చాలని డిమాండ్ చేయడం
+ లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం
+ అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపడం
+ చేతలతో.. మాటలతో లైంగిక ఉద్దేశాన్ని చెప్పడం
పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత యజమానిదే. లైంగిక వేధింపుల నిషేధంపై రూల్స్ ను అందరికి తెలియజేయాల్సి ఉంటుంది. వీటిని ఉల్లంఘించే వారికి తగిన జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధితులు కోరితే బదిలీకి యాజమాన్యం అంగీకరించాలి.. అనుమతించాలి. బాధితుడు గానీ, సాక్షి కానీ వివక్షకు గురి కాకుండా చూసుకునే బాధ్యత కంపెనీదే. బాధితులు కోరితే వేరే కార్యాలయానికి బదిలీ చేయాలి.
మహిళా ఉద్యోగుల హక్కులపై ఆఫీసులో అవగాహన కల్పించాలి.
->మరి.. వేధింపులకు శిక్ష ఏమిటన్నది చూస్తే.. మహిళను అభ్యంతరకరంగా తాకితే: 1-5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా.
->మహిళ అనుమతి లేకుండా ఆమెను ఫొటోలు తీయడం, వాటిని ఇతరులకు పంచడం వంటివి చేస్తే: 1-7 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా విధించే వీలుంది.
->అదే సమయంలో మాటల ద్వారా, సైగల ద్వారా మహిళలను అగౌరవపరిస్తే: 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
->ఇక.. తమ కింద పని చేసే వారిని లైంగికంగా లొంగదీసుకుంటే: 5-10 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా విధించే వీలుంది.
->మీటూ వేళ పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి చేస్తే.. చట్టం ఎంత కరకుగా ఉందో అర్థమైందిగా?