Begin typing your search above and press return to search.

మరొకరితో అఫైర్: లవర్‌ ను చంపి 45 ని.లు కారులో చక్కర్లు కొట్టాడు

By:  Tupaki Desk   |   17 March 2020 2:30 AM GMT
మరొకరితో అఫైర్: లవర్‌ ను చంపి 45 ని.లు కారులో చక్కర్లు కొట్టాడు
X
యూఏఈలో ఉంటున్న ఓ భారతీయ యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి హత్య చేసి - 45 నిమిషాల పాటు కారులోనే తిరిగాడు. మృతురాలు కూడా భారతీయురాలే. ఆమెను కారులో తిప్పిన సదరు యువకుడు మధ్యలో ఓ హోటల్ వద్ద ఆగి మీల్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి - కటకటాలకు పంపించారు. ఈ సంఘటన గత జూలైలో జరిగింది. దుబాయ్ కోర్టు ఈ కేసును విచారించింది. అతనికి మరణ శిక్ష విధించింది.

ప్రియురాలిని చంపిన ఆ యువకుడి వయస్సు 27. ఆమెకు అఫైర్ ఉందనే అనుమానంతో గొంతుకోసి చంపేసి - డెయిరాలోని మురకాబ్బద్ పోలీస్ స్టేషన్‌ లో లొంగిపోయాడు. గత ఏడాది జరిగిన ఈ కేసుపై ఓ పోలీస్ ఆఫీసర్ కోర్టుకు విన్నవించాడు. సదరు యువకుడు తన ప్రియురాలిని హత్య చేసిన అనంతరం రక్తంతో తడిచిన దుస్తులతో పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని - అలా చూసి తాను షాకయ్యానని చెప్పాడు.

అతనిని చూసి తాను భయపడ్డానని - తన ప్రియురాలిని చంపినట్లు తమకు చెప్పాడని - మృతురాలి డెడ్ బాడీని కారులో ముందు సీటులో ఉంచాడని పోలీసులు చెప్పారు. అక్కడ ఆమెను చంపేందుకు ఉపయోగించిన పెద్ద కత్తిని కూడా గుర్తించినట్లు చెప్పారు.

ఎందుకు చంపావని అడిగితే - తనకు - తన ప్రియురాలికి అయిదేళ్లుగా రిలేషన్‌షిప్ ఉందని, కానీ ఇటీవలి కాలంలో ఆమె మరొకరితో అఫైర్ ఉందని గుర్తించి చంపినట్లు తమకు చెప్పాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు, ఆమె మరొకరితో అఫైర్ పెట్టుకున్నట్లుగా మృతురాలి కుటుంబ సభ్యులకు కూడా అతను ఈ-మెయిల్స్ పెట్టాడు. ఆమె ఈ పద్ధతి మానుకోకుంటే చంపేస్తానని అందులో బెదిరించాడు. చివరకు అన్నంత పని చేశాడు.

పోలీసులు కోర్టుకు తెలిపిన వివరాల మేరకు.. ఓ మాల్ బయట కారును పార్కింగ్ చేశారు. అక్కడే ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఆ తర్వాత చంపేశాడు. అక్కడి నుండి ఓ రెస్టారెంట్‌ కు వెళ్లాడు. మీల్స్ ఆర్డర్ చేశాడు. వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. 45 నిమిషాలు ఆమె బాడీని ముందు సీట్ లో పెట్టుకొని సిటీలో చక్కర్లు కొట్టాడు.