Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ బలుపు మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 26 Feb 2019 6:11 AM GMTతట్టుకోలేని ఉక్రోషం. దాన్ని దాచుకోలేనితనం పాకిస్థాన్ లో తాజాగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిత్యం భారత్ ను ఏదోలా గిల్లి.. గిచ్చాలని.. దాన్ని చూసి సంతోషించే దుర్మార్గ తీరుకు గత ప్రభుత్వాల మాదిరి కాకుండా.. పన్నుకు పన్ను.. కన్నుకు కన్ను అన్న రీతిలో రియాక్ట్ అవుతున్న భారత్ తీరు దాయాది దేశానికి ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి నెలకొంది.
పుల్వామా ఉగ్రఘటనకు బదులు తీర్చుకునేందుకు వీలుగా పాకిస్థాన్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ దాడులకు సంబంధించి భారత మీడియా సంస్థ చేసిన ట్వీట్ ను ఎటకారం చేసే ప్రయత్నం చేసింది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం వహించే పాకిస్థాన్ తెహ్రిక్ ఈ-ఇన్సాఫ్. తాజాగా ఆ పార్టీ చేసిన ట్వీట్ కలకలం రేపటమే కాదు.. రెచ్చగొట్టేదిగా ఉండటం గమనార్హం.
మెరుపుదాడులకు సంబంధించిన వివరాల్ని రిపోర్ట్ చేస్తూ ప్రముఖ వార్తా ఏజెన్సీ ఏఎన్ ఐ ఒక ట్వీట్ చేసింది. అందులో ఐఏఎఫ్ మిరాజ్ 2000 ఎస్ ను ఎదుర్కొనేందుకు పాక్ కు చెందిన ఎఫ్ 16 జెట్ ఫైటర్స్ ప్రయత్నించాయని.. కానీ మిరాజ్ సామర్థ్యాన్ని చూసిన పాక్ వైమానిక దళ విమానాలు వెనక్కి తిరిగినట్లుగా పేర్కొంది. ఈ సమాచారాన్ని తమకు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కో ఆర్డినేటెడ్ ఆపరేషన్ వర్గాలు తెలిపినట్లుగా ఏఎన్ ఐ ట్వీట్ లో పేర్కొంది.
దీనిపై స్పందించిన ఇమ్రాన్ సొంత పార్టీ.. బాలీవుడ్ సినిమాల దుష్పలితాల ప్రభావం భారత మీడియా మానసిక స్థితికి ప్రమాదకరంగా మారినట్లు ఎటకారం చేసింది. గొప్ప కోసం భ్రమల్లో ముంచుతున్నట్లుగా ట్వీట్ చేసింది. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.