Begin typing your search above and press return to search.

.శ్రీదేవిని చంపింది భార‌త్ మీడియానే

By:  Tupaki Desk   |   1 March 2018 12:53 PM GMT
.శ్రీదేవిని చంపింది భార‌త్ మీడియానే
X
త‌న అభినయంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న శ్రీదేవి తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. బోనీక‌పూర్ మేన‌ళ్లుడి పెళ్లికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ హోట‌ల్ బాత్రూం ప‌డి చ‌నిపోయారు. దీనిపై ఖ‌లీజ్ టైం మ‌రోసారి త‌న రాత‌ల‌కు ప‌ద‌ను పెట్టింది. శ్రీదేవిని చంపింది ఎవ‌రోకాదు భార‌తీయులేనంటూ దుయ్య‌బ‌ట్టింది.

దుబాయ్ లో పెళ్లికి హాజ‌రైన శ్రీదేవి హోట‌ల్ బాత్రూంలో ప‌డి చ‌నిపోయారు. దీంతో కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేప‌ట్టిన దుబాయ్ ప్ర‌భుత్వం ఆమె భౌతిక కాయాన్ని అప్ప‌గించేందుకు ఒప్పుకోలేదు.

దుబాయ్ చ‌ట్టాల ప్ర‌కారం ఎవ‌రైనా చ‌నిపోతే . ఎందుకు చ‌నిపోయారు..? ప‌్ర‌మాద‌మా..? హ‌త్య‌నా..? లేక ఆత్మ‌హ‌త్య‌నా..? ఇలా అన్నీ కోణాల్లో ద‌ర్యాప్తు చేసి డెడ్ బాడీని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గిస్తారు. అతిలోక సుంద‌రి విష‌యం లో కూడా ఇదే జ‌రిగింది. పెళ్లి అనంత‌రం త‌న చిన్న కూతుర్ని తీసుకెళ్లిన బోనీ క‌పూర్ శ్రీదేవిని స‌ప్రైజ్ చేద్దామ‌ని అదేరోజు దుబాయ్ వ‌చ్చారు. జుమేరా ఎమిరేట్స్ హోట‌ల్లో నిద్ర‌పోతున్న శ్రీదేవి బోనీ క‌పూర్ ను చూసి ఆశ్చ‌ర్యానికి లోనైంది. అనంత‌రం కొద్దిసేపు మాట్లాడుకున్న వీళ్లిద్ద‌రి డిన్న‌ర్ కి భ‌య‌టకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అనుకున్న‌ట్లు సిద్ధ‌మైన శ్రీదేవి ఫ్రెష్ అయ్యేందుకు బాత్రూం కు వెళ్లింది.

అయితే ఎంత సేప‌టికి శ్రీదేవి బాత్రూం నుంచి భ‌య‌ట‌కి రాక‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గురైన బోనీ త‌న ఫ్రెండ్ కు, హోట‌ల్ సిబ్బందికి స‌మాచారం అందించారు. దీంతో స‌మాచారం అందుకున్న హోట‌ల్ సిబ్బంది బాత్రూం డోర్ త‌లుపుల్ని బ‌ల‌వంతంగా తెరిచారు. అప్ప‌టికే స్పృహ కోల్పోయిన శ్రీదేవి అచేత‌నావ‌స్థ‌లో ప‌డి ఉంది. దీంతో ఆమెను బ్ర‌తికించుకునేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నించిన బోనీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. వైద్య ప‌రిక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు ఆమె చ‌నిపోయిన‌ట్లు చెప్పారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న దుబాయ్ పోలీసు అధికారులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. అలా ప్రారంభ‌మైన ద‌ర్యాప్తు ఎట్ట‌కేల‌కు 60గంట‌ల త‌రువాత ముగిసింది. దుబాయ్ ప్ర‌భుత్వం శ్రీదేవి కుటుంబ‌స‌భ్యుల‌కు ఆమె భౌతికాయాన్ని అందించింది. బౌతిక కాయం తీసుకొని వ‌చ్చిన బోనీ కుటుంబ‌స‌భ్యులు ఆమె అంత్య‌క్రియ‌ల్ని ముంబైలో నిర్వ‌హించారు.

అయితే హోట‌ల్ బాత్రూంలో ప‌డి మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుండి శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ఇచ్చేంత వ‌ర‌కు ఎన్నో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

దీన్ని అదునుగా భావించిన భార‌త మీడియాలో శ్రీదేవి మ‌ర‌ణం అనేక క‌థ‌నాల్ని వడ్డివార్చింది. బాత్ ట‌బ్ ల‌పై త‌న క్రియేటివిటీని ఉపయోగించి శ్రీదేవి అలా చ‌నిపోయింది. ఇలా చ‌నిపోయిందంటూ రాసుకొచ్చింది. దుబాయ్ మీడియా మాత్రం శ్రీదేవి మ‌ర‌ణంలో ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు అక్క‌డ ప్ర‌భుత్వం తో క‌లిసి ప‌నిచేసింది. ఎక్క‌డా కూడా శ్రీదేవి మ‌ర‌ణంపై అనుమానాల్ని వ్య‌క్తం చేయ‌ని దుబాయ్ మీడియా నిజ నిర్ధార‌ణ చేసింది. భార‌త్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌పై దుబాయ్ మీడియా ఖ‌లీజ్ టైమ్స్ ఆ సంఘటనపై అసలేం జరిగిందో తెలుసుకోకుండానే శ్రీదేవి డెత్‌ మిస్టరీ అంటూ తమ డిటెక్టివ్‌ కథనాల ప్రసారాన్ని - బాత్‌ టబ్‌ లో సన్నివేశాలను చూపడాన్ని విమర్శించింది.

ఇలాంటి ఘటనలను మానవతా దృక్పథంతో చూడాలని - కానీ కొన్ని న్యూస్‌ ఛానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేసి శ్రీదేవిని హత్య చేశాయన్న వ్యాఖ్యలు చేసింది.

ప్రముఖ నటి శ్రీదేవి మృతిపై మీడియాపై వివిధ వ‌ర్గాల నుంచి అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. ఈ జాబితాలో విదేశీ మీడియాతో పాటుగా తాజాగా కేంద్ర మంత్రి సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. స‌మాచార ప్ర‌సార‌ మంత్రిత్వశాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ తాజాగా త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. శ్రీ‌దేవి మృతి విష‌జ్ఞంలో మీడియా వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రికాద‌ని అన్నారు. ఆఖ‌రికి ఆమె మృత‌దేహాన్ని త‌ర‌లించే ఆంబులెన్స్‌ను కూడా చేజ్ చేస్తూ ముందుకు సాగ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఈ విష‌యం ఎవ‌రిని అడిగినా చెప్తార‌ని ఆమె వ్యాఖ్యానించారు.