Begin typing your search above and press return to search.

మోడీ అంటే భార‌త మిలీనియన్ ఎందుకు ఇష్ట‌ప‌డుతోంది...!

By:  Tupaki Desk   |   6 Oct 2021 2:15 AM GMT
మోడీ అంటే భార‌త మిలీనియన్ ఎందుకు ఇష్ట‌ప‌డుతోంది...!
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి 2014 ఎన్నిక‌ల‌కు ముందు యూత్‌లో ఎలాంటి ? క్రేజ్ వ‌చ్చిందో చూశాం. యూత్ అయితే న‌మోః మోడీ మంత్రంతో ఊగిపోయారు. ఫ‌లితంగా ఈ ఎన్నిక‌ల‌లో బీజేపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆయ‌న పీఎం అయ్యాక కూడా చేసిన కొన్ని సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగా ఆ క్రేజ్ అలా కంటిన్యూ చేయ‌డ‌తోనే ఆయ‌న వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు. ముఖ్యంగా భార‌త మిలీనియ‌న్ త‌రం వాళ్లు మోడీని పిచ్చి పిచ్చిగా లైక్ చేస్తున్నార‌ని ప‌లు స‌ర్వేలు చెపుతున్నాయి. మిలీనియ‌న్స్ త‌రం అంటే 1981 - 1996 మ‌ధ్య‌లో పుట్టిన వారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి.

వీరిలో చాలా మంది తీవ్ర‌మైన నిరుద్యోగ స‌మ‌స్య‌తో ఉన్నారు. మోదీ వ‌ల్లే దేశం అభివృద్ధి చెందుతుంద‌ని.. త‌మ‌కు ఏదైనా ఉద్య‌గం దొరుకుతుంద‌న్న ఆశ‌ల ప‌ల్ల‌కీలోనే వీరు ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీరిలో 30 ఏళ్లు పై బ‌డిన వారు కూడా జీవితంలో ఇంకా నిల‌దొక్కుకోకుండా త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి జీవించ‌డ‌మో లేదా వారిపైనే ఆధార‌ప‌డి బ‌త‌క‌డ‌మో చేస్తున్నారు. వీరు క‌నీస ఖ‌ర్చుల‌కు కూడా తల్లిదండ్రులే ఆధారం. వీరిలో చాలా మంది 2014 ఎన్నిక‌ల్లో మోడీ ఇచ్చిన ల‌క్ష‌లాది ఉద్యోగాల ప్ర‌క‌ట‌న మాయ‌లో ప‌డి ఆయ‌న‌కు ఓట్లేశారు.

2019 ఎన్నికల్లో కూడా మోడీ మీదే వారికి గురి ఉంది. ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌న చూసి విసిగిపోయిన చాలా మంది మోడీ ఏదో చేస్తార‌న్న ఆశ‌ల‌తోనే ఇంకా ఉన్నారు. ముఖ్యంగా 18 - 35 సంవ‌త్స‌రాల భార‌త యువ‌త కూడా గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌లో బీజేపీకే ఓట్లేశార‌ని ఓ డేటా చెపుతోంది. ఇక జాతీయ‌త‌ను రెచ్చ‌గొట్ట‌డంలో బీజేపీ బాగా స‌క్సెస్ అయ్యింది. అందుకే ఇంగ్లీష్‌కు ఎక్కువ ప్ర‌యార్టీ ఇచ్చే కాంగ్రెస్‌ను అనేక రాష్ట్రాల్లో తుడిచి పెట్టి బీజేపీని గెలిపిస్తూ వ‌స్తున్నారు. మోడీ ఇత‌ర దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా హిందీలో చేస్తోన్న ప్ర‌సంగాలు యువ‌త‌ను వెర్రిక్కించేస్తున్నాయి.

దీనికి తోడు ముస్లింల‌లో ఎప్ప‌టి నుంచో ఉన్న ట్రిఫుల్ త‌లాక్‌కు చెక్ పెట్టేయ‌డం, పుల్వామా కాల్పుల త‌ర్వాత బీజేపీ వాళ్లు త‌మ‌ను దేశానికి చౌకీదార్ ( కాప‌లాదారులు) లుగా చెప్పుకోవ‌డంతో సామాన్యుల్లో కూడా ఆలోచ‌న‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఇక దేశంలో మెజార్టీ సంఖ్య‌లో ఉన్న హిందువుల్లో బీజేపీయే త‌మ‌ను ర‌క్షిస్తుంద‌ని.. త‌మ సంప్ర‌దాయాల‌ను కాపాడుతుంద‌న్న విశ్వాసం బ‌లంగా నాటుకుపోయింది.

దీనికి తోడు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఓసీల్లో ఆర్థికంగా వెనుక‌ప‌డిన వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్న‌ట్టు చేసిన ప్ర‌క‌ట‌న పైన చెప్పుకున్న మిలీనియం యువ‌తో మోడీ క్రేజ్‌ను అమాంతం డ‌బుల్ చేసేసింది. దీనికి తోడు ద‌శాబ్దాల కాంగ్రెస్ పాల‌న చూసి విసిగిపోయిన వారు కూడా మోడీ ప‌ట్ల విప‌రీతంగా ఆక‌ర్షితులు అయ్యేందుకు కార‌ణ‌మైంది.