Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి లెక్క‌కు ముస్లింలు ఏమంటారో?

By:  Tupaki Desk   |   28 Nov 2017 4:50 AM GMT
కేంద్ర మంత్రి లెక్క‌కు ముస్లింలు ఏమంటారో?
X
కొన్ని మాట‌లు మాట్లాడుకోవ‌టానికి బాగానే ఉన్నా ప్రాక్టిక‌ల్ గా వ‌ర్క్ వుట్ అవుతాయా? అన్న‌ది సందేహంగా ఉంటుంది. కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్ మాట‌లు కూడా ఇంచుమించు అదే రీతిలో ఉంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ కులం.. మ‌తం..ప్రాంతం అంటూ అంత‌కంత‌కూ ముక్క‌లు ముక్కలుగా మారిపోతున్న మ‌నుషుల‌కు.. వారి మ‌నోభావాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా తోచింది చెబితే ఒళ్లు మండిపోవ‌టం ఖాయం.

ఒక లక్ష్యం కోసం ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు వినేందుకు బాగానే ఉన్నా.. లోతుల్లోకి వెళితే.. స‌ద‌రు మాట‌లు ఎవ‌రినైతే ల‌క్ష్యంగా చేసుకొని చెబుతారో.. వారి స్పంద‌న అందుకు భిన్నంగా ఉండ‌టం ఖాయం. లాజిక్ గా చూస్తే చాలా అంశాలు అవున‌నే అనిపిస్తాయి. కానీ.. అందుకు అవును అనే వారు చాలా చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తారు.

ఎక్క‌డిదాకానో ఎందుకు 2000 సంవ‌త్స‌రాల క్రితం క్రైస్త‌వం ఉందా? అంటే లేద‌నే చెప్పాలి. క్రీస్తు ముందు క్రైస్త‌వం లేదు. ఆయ‌న త‌ర్వాతే క్రైస్త‌వ మ‌తం ఉంది. అదే విధంగా మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌కు ముందు ఇస్లాం మత జాడ‌లే లేవు. ఇది నిజం. ఎవ‌రైనా అంగీక‌రించే స‌త్యం. కానీ.. అప్పుడెప్పుడో తాత‌లు.. ముత్తాత‌లు కాలంలో ఎవ‌రు ఎట్లా మారారో తెలీని రీతిలో దేశంలో వివిద మ‌తాల్లోకి చేరిపోయారు.

ఇప్పుడా లెక్క‌ల‌న్నీ చూపిస్తూ.. వారి మూలాల్ని ట‌చ్ చేస్తూ.. రామాల‌య‌ గుడి క‌ల‌ను సొంతం చేసుకోవాలంటే అంత తేలిగ్గా ఒప్పుకుంటార‌ని చెప్ప‌లేం. అయితే.. ప్రాక్టిక‌ల్ గా వ‌ర్క్ వుట్ అవుతుందో లేదో అన్న‌ది ప‌క్క‌న పెట్టి.. త‌న వంతు ప్ర‌య‌త్నంగా చేస్తున్న కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

భార‌త దేశంలో హిందువులు.. ముస్లింలు ఒకే వంశం నుంచి వ‌చ్చిన‌వారేన‌ని వ్యాఖ్యానించారు. ఇక్క‌డ బాబ‌రు బిడ్డ‌లు ఎవ‌రూ లేర‌ని.. భార‌తీయ ముస్లింలంతా శ్రీ‌రాముని వార‌సులేన‌ని తేల్చారు. అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి ముస్లింలు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరుతున్నారు. షియాల మాదిరి సున్నీలు సైతం రామ‌మందిర నిర్మాణానికి సానుకూలంగా ముందుకు రావాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఆల‌య నిర్మాణంలో పాలు పంచుకోవాల‌ని పిలుపునిస్తున్నారు. వినేందుకు కొంద‌రికి మాత్ర‌మే ఇష్టంగా ఉండే ఇలాంటి మాట‌లు త‌మ‌ను అవ‌మానించేలా ఉన్నాయ‌ని ముస్లింల‌లోని కొంద‌రు భావిస్తే.. రామాల‌య చిక్కుముడి మ‌రింత చిక్కుల్లో ప‌డ‌టం ఖాయం. కేంద్ర‌మంత్రి వ‌ర్యుల మాట‌ను ముస్లింలు ఎలా తీసుకుంటారో చూడాలి.