Begin typing your search above and press return to search.

ఆసియా టాప్ 50 కుబేరుల్లో మనోళ్లు?

By:  Tupaki Desk   |   9 Oct 2015 6:12 AM GMT
ఆసియా టాప్ 50 కుబేరుల్లో మనోళ్లు?
X
సంపన్నులకు సంబంధించి ర్యాంకింగ్స్ ను తరచూ ప్రచురించే ఫోర్భ్స్ మేగ్ జైన్ తాజాగా ఆసియా దేశాలకు సంబంధించిన సంపన్నుల వివరాల్ని మదింపు చేసింది. దీనికి సంబంధించి ఆసియాలో వివిధ దేశాలకు చెందిన సంపన్నుల ఆస్తుల్ని మదింపు చేసింది. ఇందుకు కొలమానంగా సెప్టెంబర్ 25 నాటికి షేర్లు.. ఫారిన్ ఎక్సైంజ్ ఆధారంగా ఆస్తుల మదింపు జరిగింది.

ఆసియాకు చెందిన టాప్ 50 జాబితాలో 15 మంది భారతీయ సంపన్నులు జాబితాలో స్థానం సంపాదించారు. అదే సమయంలో జాబితాకు దగ్గరగా వచ్చిన వారు కాస్త ఎక్కువగానే ఉండటం గమనార్హం. ఇక.. టాప్ 50లో సగం మంది చైనాకు చెందిన వారు ఉండటం మరో విశేషంగా చెప్పొచ్చు. జాబితాలో తొలి స్థానాన్ని సామ్ సంగ్ గ్రూప్ నకు చెందిన లీన్ ఫ్యామిలీ ఉంది. 2014లో ఈ కుటుంబం రాబడి విలువ దక్షిణ కొరియా దేశ జీడీపీలో 22 శాతానికి సమానం కావటం గమనార్హం.

ఇక.. టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకున్న 14 మంది సంపన్నుల వివరాలు చూస్తే..

1. ముకేష్ అంబానీ (3 ర్యాంకు) 2,150కోట్ల డాలర్లు

2. ప్రేమ్ జీ (7 ర్యాంకు) 1,700కోట్ల డాలర్లు

3. హిందూజాలు (9 ర్యాంకు) 1,500కోట్ల డాలర్లు

4. మిస్త్రీ ఫ్యామిలీ (10 ర్యాంకు) 1,490కోట్ల డాలర్లు

5. గోద్రెజ్ ఫ్యామిలీ (15 ర్యాంకు) 1,140కోట్ల డాలర్లు

6. మిట్టల్స్ (19 ర్యాంకు) 1,010కోట్ల డాలర్లు

7. బిర్లాలు (22 ర్యాంకు) 780కోట్ల డాలర్లు

8. బజాబ్ లు (29 ర్యాంకు) 560కోట్ల డాలర్లు

9. డాబర్ బర్మన్లు (30 ర్యాంకు) 550కోట్ల డాలర్లు

10. క్యాడిలా పటేల్స్ (33 ర్యాంకు) 480కోట్ల డాలర్లు

11. ఐషర్ లాల్స్ (40 ర్యాంకు) 400కోట్ల డాలర్లు

12. శ్రీ సిమెంట్ బంగర్స్ (42 ర్యాంకు) 390కోట్ల డాలర్లు

13. జిందాల్ ఫ్యామిలీ (43 ర్యాంకు) 380కోట్ల డాలర్లు

14. ముంజాల్ ఫ్యామిలీ (46 ర్యాంకు) 320కోట్ల డాలర్లు

15. సిప్లా హమియెడ్స్ (50 ర్యాంకు) 290కోట్ల డాలర్లు