Begin typing your search above and press return to search.

యోగీజీ జాతీయ జెండా అంటే గౌర‌వం లేదా?

By:  Tupaki Desk   |   5 Nov 2017 6:10 AM GMT
యోగీజీ జాతీయ జెండా అంటే గౌర‌వం లేదా?
X
ప్రధాన నరేంద్రమోడీ క్యాబినెట్ స‌హ‌చ‌రుల్లో వివాదస్పద వ్యాఖ్యల ద్వారా తెర‌మీద‌కు ఎక్కువ‌గా వ‌చ్చే కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌, సీఎం పీఠం అధిరోహించింది మొద‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ అనూహ్య‌రీతిలో వివాదంలో చిక్కుకున్నారు. విదేశీ ప‌ర్య‌న‌లో జాతీయ ప‌తాకానికి అవ‌మానం జ‌రిగిన‌ప్ప‌టికీ ఈ ఇద్ద‌రు నేత‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం తాజా వివాదం.

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ఫోటోను ట్విట్‌ చేశారు. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ కూడా కనిపిస్తున్నారు. వీరు మారిషస్‌ పర్యటన సందర్భంగా..అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి ఓ టేబుల్‌పై మారిషస్‌, భారత దేశానికి చెందిన జాతీయపతాకాలు ఉన్నాయి. అక్కడ ఓ పుస్తకంలో కేంద్రమంత్రి సంతకం చేస్తున్నారు. కానీ ఆ టేబుల్‌పైనే ఉన్న జాతీయజెండాకు ఇద్దరు నేత‌ల‌ సమక్షంలోనే అవమానం జరిగింది. జాతీయపతాకం తిరగబడి ఉంది. అయ‌తే ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖులు కూడా దీన్ని గ‌మ‌నించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఈ ఫోటోను సాక్షాత్తు కేంద్రమంత్రి పోస్ట్‌ చేయటంతో.. సామాజిక మాధ్యమాల్లో దీనిప‌నై కామెంట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. దేశభక్తి అంటూ జపం చేస్తున్న ఇద్దరు నేతల కళ్ల‌కు.. తిరగబడ్డ జాతీయజెండా కనిపించలేదా అని కామెంట్లు షురూ అయ్యాయి. ఈ మాత్రం ప‌ట్టించుకోక‌పోతే ఎలా అంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.