Begin typing your search above and press return to search.

అమెరికా వీసా ఉంటే యూఏఈ లాగించేయ‌చ్చు

By:  Tupaki Desk   |   3 April 2017 5:42 PM GMT
అమెరికా వీసా ఉంటే యూఏఈ లాగించేయ‌చ్చు
X
గ‌ల్ఫ్ దేశ‌మైన యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ భార‌తీయుల‌కు తీపిక‌బురు అందించింది. ప్ర‌త్యేకంగా యూఏఈ వీసా పొంది ఉండ‌న‌ప్ప‌టికీ... త‌మ దేశంలో లాగించేసే చాన్స్ క‌ల్పించింది! అయితే చిన్న తిర‌కాసు ఉంది.అమెరికాకు చెందిన చెలామ‌ణిలో ఉన్న వీసాదారులు లేదా గ్రీన్ కార్డ్ క‌లిగి ఉన్న‌వారే ఈ త‌ర‌హా అనుమ‌తికి అర్హులు. స‌ద‌రు వీసాదారులు యూఏఈలోకి వ‌చ్చేందుకు అర్హ‌త పొంద‌వ‌చ్చు. 14 రోజుల గ‌డువు ఉండే ఈ వీసాకు ఒక‌సారి పున‌రుద్ధ‌రించుకునే అవ‌కాశం కూడా క‌ల్పించారు. నిర్ణిత ఫీజు చెల్లించి రెన్యువ‌ల్ చేసుకోవ‌చ్చు.

తాజా ప‌రిణామం విహార‌యాత్ర‌కు వెళ్లిన వారికి ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం గ‌త ఏడాది 1.6 మిలియ‌న్ల భార‌తీయులు యూఏఈలో ప‌ర్య‌టించారు. రెండు దేశాల మ‌ధ్య ప్ర‌తిరోజూ 143 మూడు విమానాలు త‌మ సేవ‌లు అందిస్తున్నాయి. స‌గ‌టున వారంలో 1000 విమానాలు ప్ర‌యాణికుల‌ను చేర‌వేస్తున్నాయి.

భార‌త‌దేశం- యూఏఈ మ‌ధ్య గ‌త ఏడాదిన్న‌ర కాలంగా సంబంధాలు పెద్ద ఎత్తున మెరుగుప‌డుతున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక‌ సంబంధాల‌ను మెరుగుప‌ర్చుకోవ‌డంలో కీల‌క మైలురాయిగా 2015లో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌ను చెప్పుకోవ‌చ్చు. గ‌త 40 ఏళ్ల కాలంలో ఏ ప్ర‌ధాన‌మంత్రి యూఏఈలో ప‌ర్య‌టించిన దాఖ‌లాలు లేవు. అయితే మోడీకి దీనికి భిన్న‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. త‌ద్వారా రెండు దేశాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/