Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా ని బ్యాన్ చేసిన నేవి ...ఎందుకంటే !
By: Tupaki Desk | 30 Dec 2019 10:00 AM GMTవిశాఖపట్టణం లో పాక్ కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణల తో ఏడుగరు నౌకాదళ సిబ్బందిని ఇటీవలే విశాఖ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నావికాదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా వర్గాలు ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ పేరిట సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ద్వారా వారిని పట్టుకున్నారు. ఏడుగురిని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. వీరికి జనవరి 03 వరకు రిమాండ్ విధించినట్లు సమాచారం. అయితే , వీరికి అందమైన అమ్మాయిలని , డబ్బుని ఎరగా వేసి పాక్ , చైనా ఇండియా నావికాదళం యొక్క రహస్యాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. మనదేశానికి చెందిన రక్షణ రహస్యాలు శత్రుదేశాల సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో షాక్ అయ్యింది. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
భారత నావికాదళం రహస్యాలను తెలుసుకొనేందుకు సోషల్ మీడియా ను ఉపయోగించారని గుర్తించిన భారత నేవీ ఉన్నతాధికారులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇక పై ఇండియన్ నేవీ లో స్మార్ట్ ఫోన్‌లను బ్యాన్ చేశారు. నేవీ స్థావరాలు, డాక్ యార్డులు, యుద్ధ నౌకల లో వీటిని ఉపయోగించ వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా శత్రువులకు సమాచారం అందవేస్తున్నారనే కారణంతో ఫోన్స్‌పై నిషేధం విధించారు. 2019, డిసెంబర్ 27వ తేదీన ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. నావికాదళ ప్రాంతాల్లో సోషల్ మీడియాలో భాగమైన ఫేస్ బుక్, ఇన్ స్ట్రా గ్రామ్, వాట్సాప్‌లలో పోస్టులు పెట్టడాన్ని నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కామర్స్ సైట్ల ను కూడా నిషేధిత జాబితా లోకి తీసుకొచ్చారు. భారత నేవీ వరకూ ఇవి చాలా కీలక చర్యలుగానే భావిస్తున్నారు భద్రతాధికారులు.