Begin typing your search above and press return to search.
ఆక్సిజన్ కోసం రంగంలోకి ఇండియన్ నేవీ !
By: Tupaki Desk | 1 May 2021 7:30 AM GMTభారత్ కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడిపోతుంది. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత దేశాన్ని కుదిపేస్తోంది. దేశంలో చాలా ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం లేదు. దీనితో అత్యవసర ఆక్సిజన్ సరఫరా కోరుతూ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. విమానంలో, రైళ్లల్లో, రోడ్డు మార్గాల్లో సాధ్యమైనంత తొందరగా పెద్ద మొత్తంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన అవసరం పడుతోంది. కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే యూనిట్లు దూరంగా ఉండటంతో ఆలస్యం అవుతోంది. సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడంతో ఆక్సిజన్ సకాలంలో ఆస్పత్రులకు అందించలేని పరిస్థితి ఎదురవుతోంది.
ఈ నేపథ్యంలో భారత్ లోని ఆక్సిజన్ కొరతపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. నిన్నటి వరకు ప్లైట్స్‌లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పటు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి జరుగుతోంది. దీని కోసం అక్సిజన్ సముద్ర సేతు-2 అని కేంద్ర ప్రభుత్వం పేరుపెట్టారు. దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఇండియన్ నేవి రంగంలోకి దిగింది. ఆపరేషన్ సముద్ర సేతు-2 పేరుతో విదేశాల నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్ కంటెయినర్లు సహా అనుబంధ వైద్య పరికరాలను యుద్దనౌకల ద్వారా భారత్ కు రవాణా చేయనుంది.
ఈ ఆపరేషన్ కింద.. లిక్విడ్ ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు, అనుబంధ వైద్య పరికరాలను యుద్ద నౌకల ద్వారా నౌకాదళం రవాణా చేయనుంది. ఇందు కోసం ప్రత్యేకంగా భారత యుద్ధ నౌకల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటి ద్వారా క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్ల రవాణా అయ్యే విధంగా కొన్ని చేర్పులు మార్పులు కూడా చేశారు. ఐఎన్ ఎస్ కోల్‌కతా, ఐఎన్ ఎస్ తల్వార్ అనే రెండు యుద్ధ నౌకలు.. బహ్రెయిన్ లోని మనామా నౌకాశ్రయం నుంచి ఆక్సిజన్ను తరలిస్తుండగా, బ్యాంకాక్ నుంచి ఐఎన్ ఎస్ జలష్వా, సింగపూర్ నుంచి ఐఎన్ ఎస్ ఐరావత్ ఆక్సిజన్ ను తరలిస్తున్నట్లు భారత నౌకాదళం వెల్లడించింది. వందే భారత్ మిషన్ లో భాగంగా ఆపరేషన్ సముద్ర సేతును భారత నౌకాదళం ప్రారంభించింది. మాల్దీవులు, శ్రీలంక, ఇరాన్ లలో చిక్కుకుపోయిన సుమారు 4వేల మంది భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చింది.