Begin typing your search above and press return to search.

షాక్: కేంద్రం.. ఏపీ ప్రభుత్వాల సీక్రెట్ మిషన్

By:  Tupaki Desk   |   20 Dec 2019 11:35 AM GMT
షాక్: కేంద్రం.. ఏపీ ప్రభుత్వాల సీక్రెట్ మిషన్
X
దారుణమైన కుంభకోణం ఒకటి బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. ఏపీ ఇంటెలిజెన్స్ తో పాటు కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా నిర్వహించిన రహస్య ఆపరేషన్ లో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఏపీలోని విశాఖలో పని చేసే ఏడుగురు నేవీ అధికారులతో పాటు ఒక హవాలా వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా నేవీకి చెందిన సీక్రెట్స్ ను పాక్ కు చేరవేస్తున్నట్లుగా చెబుతున్నారు.

రక్షణ విభాగానికి చెందిన కీలక సమాచారాన్ని దాయాది దేశానికి అందజేస్తున్న వైనం సీక్రెట్ మిషన్ లో గుర్తించినట్లు చెబుతున్నారు. గత నెల రోజులుగా ఈ ఆపరేషన్ ను చేపట్టారు. ఈ మిషన్ లో దొరికిపోయిన నిందితుల్ని తాజాగా విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. వీరిని విచారించిన కోర్టు రిమాండ్ విధించింది. పాక్ తో పాటు హవాలా ముఠాలతో వీరికి సంబంధాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.

అయితే.. ఈ రహస్య ఆపరేషన్ లో అదుపులోకి తీసుకున్న వారిలో ఎంతమంది ఉన్నారు? ఏ స్థాయి అధికారులు ఉన్నారు? దేశం నుంచి బయటకు వెళ్లిన రహస్యాలు ఎంత కీలకమైనవి? దీనికి సహకరించిన వారందరిని అదుపులోకి తీసుకున్నారా? ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకోవాల్సి ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం రావటం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో నేవీ అధికారులు పలువురు దేశ రహస్యాల్ని పాక్ కు చేరవేయటం ఆందోళన కలిగిస్తుందని చెప్పక తప్పదు.