Begin typing your search above and press return to search.

డ్రాగ‌న్‌ కు దిమ్మ తిరిగే నిర్ణ‌యం తీసుకున్నారుగా

By:  Tupaki Desk   |   2 Dec 2017 11:03 AM GMT
డ్రాగ‌న్‌ కు దిమ్మ తిరిగే నిర్ణ‌యం తీసుకున్నారుగా
X
ఎంత స్నేహంగా ఉండాల‌నుకున్నా.. అత్యాశ‌తో.. అధిప‌త్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తూ ఏ మాత్రం న‌మ్మ‌లేని తీరుతో వ్య‌వ‌హ‌రిస్తుంటుంది డ్రాగ‌న్ దేశ‌మైన చైనా. పేరాశ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌న‌తో స‌రిహ‌ద్దు ఉన్న ప్ర‌తి దేశంతోనూ ఏదో ర‌కంగా పంచాయితీ పెట్టుకోవ‌టం చీనీకి కొత్తేం కాదు.

ఇక‌.. భార‌త్ అంటే ఆ దేశానికి ఉన్నంత అసూయ అంతా ఇంతా కాదు. ఏదో విధంగా దేశం మీద అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని త‌పిస్తుంటుంది. ఇందులో భాగంగా డోక్లాం ద‌గ్గ‌ర త‌న క‌ప‌ట‌బుద్ధిని ప్ర‌ద‌ర్శించే వేళ‌.. ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అయిన తీరుకు షాక్ తిన్న‌ద‌నే చెప్పాలి.

ఎప్ప‌టికి న‌మ్మ‌లేని స‌రిహ‌ద్దు దేశ‌మైన చైనాకు ధీటుగా భ‌ద్ర‌త‌ప‌ర‌మైన చ‌ర్య‌ల ప‌ట్ల భార‌త్ ఇప్పుడు దృష్టి సారించింది. డోక్లాం ఇష్యూ త‌ర్వాత స‌రిహ‌ద్దుల వ‌ద్ద భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసిన భార‌త్ తాజాగా న్యూక్లియ‌ర్ స‌బ్ మెరైన్ల‌పై దృష్టి సారించింది.

ఇప్ప‌టివ‌ర‌కూ స‌బ్ మెరైన్ల సంఖ్య‌ను పెంచుకునే విష‌యంలో పెద్ద‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌ని భార‌త్ ఇప్పుడు అందుకు భిన్నంగా ఏక‌కాలంలో ఆరు న్యూక్లియ‌ర్ స‌బ్ మెరైన్ల నిర్మాణానికి ఓకే చెప్పేసింది. ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మైన‌ట్లుగా నేవీ చీఫ్ ఆడ్మిన‌ర‌ల్ సునీల్ లంబా వెల్ల‌డించారు. తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో ప‌సిఫిక్ రీజియ‌న్ లో చైనా అధిప‌త్యాన్ని భార‌త్ స‌వాలు చేయ‌గ‌ల‌ర‌ని చెబుతున్నారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ లో భారత్‌ - అమెరికా - జపాన్‌ - ఆస్ట్రేలియాల చతుర్భుజ కూటమికి స్థిరమైన ఆకృతిని తీసుకురావడం లో నేవీ కీల‌క భూమిక పోషించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు . ఏమైనా భ‌ద్రతాప‌ర‌మైన చ‌ర్య‌ల్లో ఇదో ముంద‌డుగుగా చెప్ప‌క త‌ప్ప‌దు.