Begin typing your search above and press return to search.
అమెరికా నుంచి వచ్చేయడమే బెటరా?
By: Tupaki Desk | 26 Feb 2017 8:05 AM GMT2001లో 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా ప్రజానీకంలో నాటుకుపోయిన ఇస్లామోపోబియాను మరింత రెచ్చగొట్టడమే కాకుండా ఓట్లుగా మల్చుకునేందుకు ట్రంప్ సాగించిన విద్వేష విష ప్రచార ప్రభావ ఫలితంగా అమెరికన్ల చేతిలో శ్వేత వర్ణేతరులు బలైపోతున్నారు. జాతి వివక్ష విషకాటుకు అలా బలైపోతున్నవారిలో ఆసియా వాళ్లు, అందునా భారతీయ ఐటి నిపుణులుండటం అత్యంత ఆందోళనకరం. నిన్నటికి నిన్న కన్సాస్ లోని ఓ బార్ లో శ్వేతవర్ణ దురహంకారి జరిపిన కాల్పుల్లో తెలుగు సాంకేతిక నిపుణుడు కూచిబొట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం, మరో యువకుడు అలోక్ క్షతగాత్రుడవ్వడం బాధాకరం. శ్రీనివాస్ అందరితో ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉండేవాడని, ఆయనకు ద్వేషం అనే పదమే తెలియదని సన్నిహితులు చెబుతుంటే.. అలాంటి వ్యక్తినే బలి తీసుకున్నారంటే వర్ణ దరహంకారం ఎంతగా పెట్రేగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందూ ఇలాంటి ఘటనలు జరిగినా ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇవి ఇక్కడితే ఆగేలా లేవు. ఎందుకంటే ఇవి మామూలుగా జరుగుతున్నవి కావు.. ప్రభుత్వ ప్రేరణతో బలిసిన అమెరికన్లు చేస్తున్నవి.
ఇలాంటి దాడులను భారత్ లోని అమెరికా రాయబారి కార్యాలయం - అంతర్జాతీయ సమాజం ఖండిస్తున్నా హత్యలు మాత్రం ఆగడం లేదు. దీంతో అక్కడున్న అమెరికేతరుల బతుక్కు భరోసా అన్నది లేకుండా పోయింది. శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలంటూ లక్షా 50 వేల డాలర్ల సేకరణ లక్ష్యంతో పిలుపునిస్తే..గంటల వ్యవధిలోనే 6,100 మంది స్పందించి 2,27,500 డాలర్లు విరాళంగా ఇవ్వడం దాతృత్వ హృదయావిష్కరణతో పాటు జాతి వివక్షకు వ్యతిరేకంగా గళంవిప్పే ప్రజానీక ఐక్యతకు కూడా దర్పణం పడుతోంది. అయినా ప్రాణాలకు మాత్రం గ్యారంటీ లేదు. భద్రమైన పరిస్థితులు మళ్లీ వస్తాయన్న నమ్మకం లేదు. దీంతో చాలామంది ఎన్నారైల మనసు మారుతోంది. ఇండియా వైపు మళ్లుతోంది. ఇతర దేశాల వైపు వారి చూపు పడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉండడం అవసరమా అన్న ఆలోచన చాలామందిలో కలుగుతోంది. మంచి జీతాలు... మంచి జీవితం అన్నీ ఉన్నా ప్రాణాలకు గ్యారంటీ లేకపోతే అక్కడ బతకడం ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది. కెనడా - యూరోపియన్ దేశాలు ఇండియన్సుకు రెడ్ కార్పెట్ పరుస్తున్న తరుణంలో అమెరికాను పట్టుకుని వేలాడాల్సిన అవసరమేంటని నిపుణులు అంటున్నారు. అమెరికా ఎకానమీలో భారతీయుల పాత్ర చాలా ఉందని.. అక్కడి సిలికాన్ ఇండస్ర్టీలో జెయింట్సు మనోళ్లేనని.. అలాంటప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేస్తే నష్టం వారికే తప్ప మనకు కాదన్న వాదన బలపడుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/