Begin typing your search above and press return to search.
మైనర్ ను రేప్ చేసిన ప్రవాస భారతీయుడు
By: Tupaki Desk | 23 Nov 2018 4:30 PM GMTఅమెరికాలో భారతీయులపై జరిగే దాడులు.. రోడ్డు ప్రమాదాల గురించే తరచుగా వార్తలొస్తుంటాయి. ఐతే అరుదుగా మనవాళ్లు సైతం ఘోరాలకు పాల్పడుతుంటారు. పోలీసుల చేతికి చిక్కుతుంటారు. తాజాగా సచిన్ అజి భాస్కర్ అనే ప్రవాస భారతీయుడు అమెరికాలో ఓ కేసులో చిక్కుకున్నాడు. అతను ఓ మైనర్ బాలికను రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 22 ఏళ్ల సచిన్.. ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా 11 ఏళ్ల అమ్మాయికి దగ్గరయ్యాడు. ఆమె తన వయసు 15 ఏళ్లుగా అతడికి చెప్పింది.
ఒక రోజు ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లిన సచిన్.. మూడు గంటల తర్వాత తన ఇంట్లో విడిచి పెట్టి వెళ్లాడు. ఆ అమ్మాయితో అతను సెక్స్ చేసినట్లు తెలిసి బాధితురాలి కుటుంబం కేసు పెట్టింది. పోలీసులు సచిన్ ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. నేరం రుజువైతే సచిన్ కు పదేళ్ల దాకా జైలు.. రెండున్నర లక్షల డాలర్ల జరిమానా పడేందుకు ఆస్కారముంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ఆధ్వర్యంలో నడిచే ఛైల్డ్ ఎక్స్ ప్లాయిటేషన్ టాస్క్ ఫోర్స్ విభాగం సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న ప్రత్యేక దర్యాప్తు సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సచిన్ ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది.