Begin typing your search above and press return to search.

అమెరికా రెస్టారెంటులో ఉల్లి గొడ‌వ‌

By:  Tupaki Desk   |   15 Jun 2017 7:10 AM GMT
అమెరికా రెస్టారెంటులో ఉల్లి గొడ‌వ‌
X
అమెరికాలో ఓ భారత సంతతి వ్యక్తి అల్లకల్లోలం చేశాడు. ఓ భారతీయ రెస్టారెంటుకు వెళ్లి అక్కడ ఒంటిపై నూలుపోగు లేకుండా మారి హల్ చల్ చేశాడు. అక్క‌డున్న వారు నిల‌దీయ‌డానికొస్తే తుపాకీతో వారిపై గురి పెట్టి కాల్పులు జ‌రుపుతా అని బెదిరించాడ‌ట‌.. ఇంతకీ ఆయన ఇంతపని ఎందుకు చేశాడో తెలుసా...? ఆయన ఆర్డర్ చేసిన ఫుడ్ లో రెస్టారెంటు వారు ఉల్లిపాయలు వేయడంతో ఆయన రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాడట.

ఓక్లాండ్ లోని ఆల్ ఇండియా రెస్టారెంటుకు యువరాజ్ శర్మ అనే 43 ఏళ్ల వ్యక్తి వెళ్లాడు. తినడానికి ఏదో ఆర్డర్ చేశాడు. అత‌నికి ఆనియ‌న్ అల‌ర్జీ. ఇండియన్ రెస్టారెంటు కదా.. ఆ ఫుడ్ లో కాసిన్ని ఉల్లిపాయలు వేశారు. అంతే శర్మకు పట్టరాని కోపమొచ్చేసింది. అక్కడి సిబ్బందితో తగాదా పెట్టుకున్నాడు.

అక్కడితో దాన్ని వదిలేయకుండా మరుసటి రోజు ఫుల్లుగా తాగేసి వచ్చి మరోసారి గొడవ పడ్డాడు. ప్యాంటు జేబులో పిస్తోలు పెట్టుకుని వచ్చిన ప్యాంటు విప్పేసి హంగామా చేశాడు. తుపాకీతో కాల్చి ప‌డేస్తా అని బెదిరిస్తూ బూతులు తిట్టాడు. హోటల్ యజమాని రవీందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చిన శర్మను అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల అనుమానం... అసభ్యకర ప్రవర్తన - అరెస్టును అడ్డుకోవడం వంటి ఆరోపణలతో ఆయనపై కేసులు పెట్టారు. మొత్తానికి ఉల్లి లొల్లి శర్మను కటకటాల పాల్జేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/