Begin typing your search above and press return to search.
అమెజాన్ పై అమ్మ కేసు పెట్టింది..
By: Tupaki Desk | 8 Sep 2015 9:50 AM GMTఅంతర్జాతీయ పేరున్న ఈకామర్స్ వెబ్ సైట్ పై ఓ అమ్మ కేసు పెట్టింది. రెండున్నరేళ్ల కిందట తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయంలో ఆమె అమెజాన్ పై నేరారోపణ చేస్తూ పెన్సిల్వేనియా కోర్టులో మొన్న జులై నెలలో కేసు వేసింది.. ఆన్ లైన్ లో సెనైడ్ అమ్మి అమెజాన్ ఈ కేసులో ఇరుక్కుంది.
ఇదీ విషయం..
ఆర్యసింగ్ అనే అమ్మాయి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతుండేది. 2013లో ఆమె అమెజాన్.కామ్ లో సెనైడ్ కొని దాన్ని మింగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆర్య తల్లి సుజాత సింగ్ ఈ ఏడాది జులైలో అమెజాన్.కామ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీలపై కేసు నమోదు చేసింది. యూనివర్సిటీలో తన కుమార్తెను లైంగికంగా వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని... అమెజాన్.కామ్ సెనైడ్ విక్రయించిందని పేర్కొంటూ యూనివర్సిటీ, అమెజాన్లపై కేసులు పెట్టింది.
కాగా 2013 ప్రారంభంలో అమెజాన్ సెనైడ్ విక్రయాలు ప్రారంభించింది. అయితే.. అది ప్రమాదకరంగా మారడంతో ఆ ఏడాది ఫిబ్రవరి 2న విక్రయాలు నిలిపేసింది. కానీ అప్పటికే 51 మంది కొనుగోలు చేశారు. అందులో ఆర్య సహా 12 మంది దాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి వినియోగించారు. మిగతావారు ఆ సైనైడ్ ను ఇంకేదైనా అవసరాలు వాడారా.. లేదంటే హత్యలు చేయడానికి వినియోగించారా అన్నది తెలియాల్సి ఉంది.