Begin typing your search above and press return to search.
అమెరికాలో భారతీయుడిపై మళ్లీ కాల్పులు..
By: Tupaki Desk | 14 Jun 2017 6:58 AM GMTఅగ్రరాజ్యమైన అమెరికాలో భారతీయులు బలిపశువులుగా మారుతున్నారు. కొందరు విద్వేషాగ్నికి ఆహుతైపోతుంటే.. మరికొందరు దోపిడీ దొంగల చేతికి బలి అవుతున్నారు. కారణం ఏదైనా.. గతానికి భిన్నంగా ఈ మధ్యన ఇండియన్స్ తరచూ టార్గెట్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. మొన్నీ మధ్యనే తెలుగు ప్రాంతానికి చెందిన యువకుడు కాల్పులకు గురై.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.
ఈ ఉదంతాన్ని మర్చిపోక ముందే తాజాగా మరో భారతీయుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అమెరికాలోని అట్లాంటాలో డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో పని చేస్తున్న గుజరాత్ కు చెందిన యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బాధితుడిని గుజరాత్ కు చెందిన 24 ఏళ్ల హస్ ముఖ్ పటేల్ గా గుర్తుపట్టారు. మూడేళ్ల కిందట ఉద్యోగాల వేటలో భాగంగా అమెరికాకు చేరుకున్న అతగాడు ప్రస్తుతం ఒక స్టోర్ లో పని చేస్తున్నాడు.
తాజాగా స్టోర్ మూసేస్తున్న వేళ.. చొరబడిన దుండగులు పటేల్ నుంచి క్యాష్ రిజిష్టర్ లాక్కునే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పటేల్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఉదంతంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి వైద్యసాయాన్ని అందిస్తున్నారు. గడిచిన ఐదు నెలల వ్యవధిలో భారతీయులపై ఈ తరహా దాడులు మూడు జరిగాయి. మరోవైపు.. పటేల్ కుటుంబ సభ్యులు కొడుకు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/