Begin typing your search above and press return to search.
కులానికే కొమ్ముకాస్తున్న ఓటరు!
By: Tupaki Desk | 18 July 2018 2:30 PM GMTభారత దేశపు ఎన్నికలలో గెలుపోటములను డబ్బుతోపాటు చాలా అంశాలు ప్రభావితం చేస్తాయన్న సంగతి తెలిసిందే. ధన ప్రవాహంతో పాటు కులం - ప్రాంతం - మతం కూడా ఓ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయని తాజా సర్వేలో వెల్లడైంది. తమ కులం లేదా మతానికి చెందిన అభ్యర్థికే ఓటు వేసేందుకు ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతారని అజీమ్ ప్రేమ్ జీ - లోక్ నీతి లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నిరక్ష్యరాస్యులైన ఓటర్లు..ఎక్కువగా ఈ తరహాలో ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది. ఉన్నత వర్గాలకు చెందిన వారంతా....తమ కులం - మతం కాని వారిని ఎన్నుకునేందుకు ఇష్టపడడం లేదని స్పష్టమైంది. ఉన్నత విద్యనభ్యసించిన వారిలో 90 శాతం మంది....కుల - మతాలకు అతీతంగా అభ్యర్థిని బట్టి ఓటు వేయాలని యోచిస్తున్నట్లు తేలింది.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ - బిహార్ - మధ్య ప్రదేశ్ - ఛత్తీస్ గఢ్ - మహారాష్ట్ర - రాజస్థాన్ - జార్ఘండ్ లలో ఈ సర్వేను చేపట్టారు. 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 వేల మంది అభిప్రాయాలను సేకరించారు. 67 శాతం నిరక్షరాస్యులు తమ కులం లేదా మతం లేదా తెగ వారికే ఓటు వేసేందుకు మొగ్గుచూపారు. పాఠశాల విద్యనభ్యసించిన 56 శాతం మంది ప్రజలు....కాలేజీ విద్యనభ్యసించిన 47 శాతం మంది ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఉన్నత విద్యనభ్యసించిన వారు 10 శాతం మంది మాత్రమే కులాన్ని బట్టి ఓటు వేసేందుకు మొగ్గు చూపారు. ఆంధ్రప్రదేశ్ లో 43 శాతం మంది ప్రజలు తమ కులం వారికే ఓటు వేయాలని - 38 శాతం మంది ప్రజలు తమ మతం వారికే ఓటు వేయాలని ఫిక్స్ అయ్యారట. అదే తెలంగాణలో....48 శాతం మంది ప్రజలు తమ కులం వారికే ఓటు వేయాలని, 46 శాతం మంది ప్రజలు తమ మతం వారికే ఓటు వేయాలని డిసైడ్ అయ్యారట.