Begin typing your search above and press return to search.

నిజమెంత‌?: అభినంద‌న్ పై డాన్ సంచ‌ల‌న క‌థ‌నం

By:  Tupaki Desk   |   28 Feb 2019 7:38 AM GMT
నిజమెంత‌?: అభినంద‌న్ పై డాన్ సంచ‌ల‌న క‌థ‌నం
X
పాక్ యుద్ధ విమానాన్ని త‌రిమికొడుతూ.. దాన్ని కూల‌గొట్టే ప్ర‌య‌త్నంలో పొర‌పాటున పాక్ భూభాగంలోకి వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ద‌న్ ప్ర‌వేశించ‌టం.. ఆయ‌న యుద్ధ విమానాన్ని పాక్ ద‌ళాలు కూల్చి వేసిన వైనం తెలిసిందే. దాన్లో నుంచి ప్యారాచూట్ సాయంతో సుర‌క్షితంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న పాక్ ద‌ళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దాడి జ‌రిగిన వైనం ఇప్ప‌టికే వీడియోల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై పాక్ కు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ డాన్ ఒక సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఆ క‌థ‌నంలో నిజం పాళ్లు ఎంత‌న్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. అయితే.. ఈ క‌థ‌నంలో పేర్కొన్న అంశాలు.. దానికి త‌గిన సాక్ష్యాలుగా ఫోటోల్ని ఇవ్వ‌కుండా క‌థ‌నం ప్ర‌చురించిన తీరు ఇప్పుడు ప‌లు సందేహాల‌కు తెర తీసేలా ఉంది.

వాస్త‌వాధీన రేఖ‌కు (ఎల్ వోసీ) సరిగ్గా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి సమీపంలో బుధవారం ఉదయం 8:45 నిమిషాల సమయంలో రెండు ఎయిర్‌ క్రాఫ్ట్‌ లు మంటల్లో కాలిపోవడం చూసిన‌ట్లు 58 ఏళ్ల మ‌హ్మ‌ద్ ర‌జాక్ మా ప‌త్రిక‌కు ఫోన్ చేసి చెప్పారు. కాలిపోతున్న విమానం నుంచి ఒక వ్య‌క్తి పారాచ్యూట్ లో త‌న ఇంటికి కిలోమీట‌రు దూరంలో దిగ‌టం చూశాన‌ని వెల్ల‌డించారు.

గ్రామానికి చెందిన కొంద‌రు యువ‌కుల్ని వెంట తీసుకెళ్లి అక్క‌డ‌కు వెళ్ల‌గా ఒక పైల‌ట్ క‌నిపించాడ‌ని ర‌జాక్ చెప్పారు. యువ‌కుల్ని ద‌గ్గ‌ర‌కు వెళ్లొద్ద‌ని.. సైన్యం వ‌చ్చే వ‌ర‌కూ ఆగాల‌ని అత‌డు చెప్పాడు. ర‌జాక్ వెళ్లే స‌మ‌యానికి పైల‌ట్ కొన్ని డాక్యుమెంట్ల‌ను.. మ్యాప్ ల‌ను మింగేసేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని చెప్పారు.

డాన్ పేర్కొన్న మిగిలిన క‌థ‌నం చూస్తే...

+ పిస్టల్ చేతబుచ్చుకున్న ఆ పైలట్ ‘ఇది ఇండియానా లేక పాకిస్థానా’ అని స్థానిక యువకులను అడిగాడు. ఆ యువకుల్లో ఒక‌రు తెలివిగా వ్యవహరించి ‘ఇది ఇండియా’ అని అబద్ధం చెప్పాడు. దీంతో పైలట్ అభినందన్ ‘ఇండియా జిందాబాద్’ అని నినాదాలు చేశాడు. దాహంగా ఉందని - నీళ్లు ఇవ్వాలని కోరాడు. అభినందన్‌ ఇండియాకు చెందిన వ్యక్తి అని తెలుసుకున్న కొందరు యువకులు ‘పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్’ అని నినాదాలు చేశారు.

+ దీంతో అభినంద‌న్ త‌న ద‌గ్గ‌రి తుపాకీతో గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. ఈ ప‌రిణామంతో కంగుతిన్న యువ‌కులు రాళ్ల‌ను చేతిలోకి తీసుకున్నారు. అభినంద‌న్ దాదాపు అర‌కిలోమీట‌రు వెన‌క్కి ప‌రిగెత్తాడు. అత‌డ్ని వెంబ‌డించిన యువ‌కులను అభినంద‌న్ పిస్ట‌ల్ చూపించి భ‌య‌పెట్టాడు.

+ ఆ సంద‌ర్భంగా పెనుగులాట చోటు చేసుకుంది. అభినంద‌న్ గాల్లోకి కాల్పులు జ‌ర‌ప‌టం.. జేబులో నుంచి కొన్ని డాక్యుమెంట్లు తీసి నీటిలో ముంచి నాశ‌నం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. పిస్ట‌ల్ కింద ప‌డేయాల‌ని అక్క‌డి యువ‌కులు కేక‌లు వేశారు. ఒక యువ‌కుడి కాలిపై కాల్పులు జ‌రిపారు (డాన్ ప‌త్రిక పేర్కొన్న దాని ప్ర‌కారం)

+ అభినంద‌న్ ను చుట్టుముట్టిన యువ‌కులు అత‌డిపై దాడి చేశారు. ఆ స‌మ‌యంలో పాక్ సైన్యం వ‌చ్చి అత‌డ్ని కాపాడింది.