Begin typing your search above and press return to search.

విశ్వాసం కోల్పోతున్న రాజకీయ వీరులు!

By:  Tupaki Desk   |   24 Nov 2021 6:35 AM GMT
విశ్వాసం కోల్పోతున్న రాజకీయ వీరులు!
X
దేశంలో రాజ‌కీయాలను గ‌మ‌నిస్తే.. కీల‌క‌మైన నాయ‌కులు.. అధికారంలో ఉండి చ‌క్రాలు తిప్పుతున్న పాల‌కు లు.. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అదే క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వాన్ని తీసుకుం టే.. నాక‌న్నా.. మోనార్క్ ఎవ‌రున్నార‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించుకునే ప్ర‌ధాన మంత్రి మోడీ.. రైతు చ‌ట్టాల విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు.

స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించారు. ``నేను చేసిన చ‌ట్టాలను నేనే వెన‌క్కి తీసుకుంటున్నాను. రైతుల ప‌ట్ల నాకు అపార‌మైన ప్రేమ ఉంది. మూడు సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఉద్య‌మం చేస్తున్న రైతులు.. వెంట‌నే మీ ఇళ్ల‌కు వెళ్లి సేద‌దీరండి`` అని ప్ర‌క‌టించారు.

నిజానికి దేశానికి అధినేత అయిన‌.. ప్ర‌ధాని మోదీ ఈ మాట చెప్ప‌గానే ఉద్య‌మం చేస్తున్న రైతులు వెంట నే హ‌ర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ.. వెంట‌నే వెన‌క్కి వెళ్లిపోవాలి. ప్ర‌ధాని మోదీ చిత్ర‌ప‌టాల‌కు క్షీరాభిషేకం చేయాలి. కానీ, ఇలా జ‌ర‌గ‌లేదు. పైగా ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తామ‌నే ప్ర‌క‌టించారు. దీనికి కార‌ణం.. విశ్వాసం లేక‌పోవ‌డ‌మే.

క‌ట్ చేస్తే.. తెలంగాణను తీసుకుందాం. ఇక్క‌డ ధాన్యం సేక‌ర‌ణ‌ల‌కు సంబంధించి.. రైతులు తీవ్ర అగ‌చాట్లు ప‌డుతున్నారు. పైగా వ‌రి వేస్తే.. జైలుకే అని అధికారులు బెదిరింపులకు దిగారు. ఈ నేప‌థ్యంలో త‌ప్పు మాదికాదు.. కేంద్రానిదే.. అని.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ స్వ‌యంగా రోడ్డెక్కారు. ధ‌ర్నా చేశారు.

అంతేకాదు.. దేశంలో అగ్గిపెడ‌తాన‌ని అన్నారు. మ‌రి రైతులు విశ్వ‌సించారా? అంటే..లేదు. ఎక్క‌డో అనుమాన‌పు చూపులు కేసీఆర్‌నే వెంటాడాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న మాట‌ల‌కు చేత‌ల‌కు పొంత‌న లేక‌పోవ‌డం.. గ‌డిచిన ఏడేళ్లుగా ఆయ‌న‌ను చూస్తున్న‌వారు.. విశ్వాసాన్ని పెంచుకోలేక పోవ‌డ‌మే.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌ద్దాం.. ఇక్క‌డ అటు ప్ర‌భుత్వాన్ని, ఇటు ప్ర‌తిప‌క్షాన్ని కూడా విశ్వ‌సించే ప‌నిలేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తోంది. మూడు రాజ‌ధానుల‌పై ఉన్న ప‌ట్టుద‌ల‌ను ప్ర‌త్యేక హోదా ను సాధించేం దుకు ప్ర‌భుత్వంలో ఉన్న జ‌గ‌న్ చూపించ‌లేక పోయారు. అదేస‌మ‌యంలో అభివృద్ధిపైక‌నీసం.. దృష్టిపెట్ట‌లేక పోయారు.

రైతు రాజ్యం, రాజన్న రాజ్యం అంటూనే.. రైతులను అవ‌మానిస్తున్నారు. దీంతో ఆయ‌న‌ను ఎలా న‌మ్ము తాం? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నేత‌లు కూడా రాజ‌ధానిని క‌ట్టే అవ‌కాశం ఉండి కూడా.. అప్ప‌ట్లో అన్నీతాత్కాలికం చేసి.. ఎన్నిక‌ల‌కు వినియోగించుకున్నార‌నే వాద‌న ఉంది.

అదేస‌మ‌యంలో మితిమీరిన అవినీతిని క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయార‌నే వాద‌న వినిపించింది. ఇప్పుడు వీరిని ఎలా న‌మ్ముతాం! అనే ప్ర‌శ్న స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. నేత‌లు విశ్వాసం కోల్పోతున్నార‌నే వాద‌నకు బ‌లం చేకూరుతోంది.