Begin typing your search above and press return to search.

పడిపోనున్న భారత జనాభా.. ఏమవుతుంది?

By:  Tupaki Desk   |   19 July 2020 2:30 AM GMT
పడిపోనున్న భారత జనాభా.. ఏమవుతుంది?
X
2100 సంవత్సరం నాటికి భారత జనాభా 100కోట్లకు పడిపోతుందని.. ఇప్పటితో పోలిస్తే 30-35 కోట్ల మంది వరకు జనాభా తగ్గిపోతుందని ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్ ఓ నివేదికలో పేర్కొంది.

అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుంది. మన తర్వాత నైజిరియా, చైనా, అమెరికా, పాకిస్తాన్ లు నిలుస్తాయి. ప్రస్తుతం 780 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 2100 నాటికి 880కోట్లకు పెరుగుతుందని నివేదికలో పేర్కొంది.

చైనాను భారత్ 2027 కల్లా జనాభాలో దాటేస్తోంది. 2047నాటికి 161 కోట్లకు చేరుతుంది. తగ్గుతున్న గర్భధారణ రేటు, వృద్ధుల సంఖ్య పెరగడం.. వివాహాల వయసు పెరగడం.. కుటుంబ నియంత్రణ.. కాన్పుకు కాన్నుకు మధ్య దూరం వంటివి జనాభా తగ్గుదలకు కారణంగా నివేదిక పేర్కొంది.

2035నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతుందని లాన్సెట్ పేర్కొంది. అమెరికా రెండు, భారత్ 3వ స్థానాల్లో ఉంటాయని వివరించింది.

ఇక సగానికి జనాభా పడిపోయే దేశాలు కూడా ఉంటాయని పేర్కొంది. జపాన్, స్పెయిన్, ఇటలీ, థాయ్ లాండ్, దక్షిణకొరియా, పోలాండ్, పోర్చుగల్ లో జనాభా బాగా తగ్గి మ్యాన్ పవర్ కోసం భారతీయులకు ఆహ్వానం పలకాల్సి వస్తుందని నివేదిక పేర్కొంది.

అయితే పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం, ఉద్యోగాలు కల్పనను కల్పించాలి. భారీ జనాభాను అవకాశంగా మలుచుకోవాలి. లేదంటే ఇదో పెద్ద విపత్తుగా మారి ఆకలికేకలు చెలరేగే ప్రమాదం కూడా ఉంది.