Begin typing your search above and press return to search.
మనకు దాయాది అంత షాకిచ్చిందా?
By: Tupaki Desk | 20 Nov 2016 4:28 AM GMTఊహించని పరిణామం చోటు చేసుకుందా? దాయాది మనకు షాకిచ్చిందా? అంటే.. అవుననే చెబుతున్నాయి పాక్ వర్గాలు. నియంత్రణ రేఖ దాటి తమ భూభాగంలోకి చొరబడిన భారత డ్రోన్ ను తాము కూల్చేసినట్లుగా పాకిస్థాన్ తాజాగా ప్రకటించింది. తమ భూభాగంలో ప్రవేశించిన భారత్ క్వాడ్ కాఫ్టర్ ను తమ దళాలు కూల్చేసినట్లుగా వెల్లడించింది.
తాము కూల్చివేసిన డ్రోన్ శకలాలు రాక్ చక్రి సెక్టార్ లోని అగాయ్ పోస్టు సమీపంలో పడినట్లుగా పాక్ వెల్లడించింది. సర్జికల్ దాడుల తర్వాత ఇరుదేశాల సరిహద్దుల్లో దాయాది పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడిందని చెబుతున్నారు. ఒక అంచనా పరకారం పాక్ 286 సార్లు షెల్లింగ్.. మోర్టార్లతో కాల్పులకు పాల్పడింది.
నిబంధనల్ని ఉల్లంఘిస్తూ పాక్ జరిపిన కాల్పుల కారణంగా 14 మంది భద్రతా సిబ్బందితో సహా 26 మంది ప్రజలు మరణించినట్లు చెబుతున్నారు. కొద్దిరోజులుగా ఇరుదేశాల మధ్య సాగుతున్న ఘర్షణల్లో భారత సైనికులే ఎక్కువగా చనిపోయినట్లుగా తాజాగా పాక్ వెల్లడించింది. వారి లెక్కల ప్రకారం భారత్ తరఫు 40మంది సైనికులు చనిపోతే.. తమ తరఫు 20 మంది మాత్రమే చనిపోయినట్లుగా పాక్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో భారత్ తనకు జరిగిన ప్రాణనష్టాన్ని తక్కువ చేసి చూపుతుందని పాక్ చెబుతోంది. దీనిపై భారత్ వర్గాలు స్పందించాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/