Begin typing your search above and press return to search.
'పోస్ట్ కోవిడ్ కోచ్' ..కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే సరికొత్త వ్యూహం !
By: Tupaki Desk | 15 July 2020 4:00 PM ISTఓ కంటికి కనిపించని కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎంతో అభివృద్ధి చెందాము అని చెప్పుకుంటున్న దేశాలు సైతం కరోనా దెబ్బకి వణికిపోతున్నాయి. సాంకేతికంగా ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ కరోనా వెలుగులోకి వచ్చి ఏడూ నెలలు దాటినా ఇంకా సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేకపోతున్నారు. కరోనాతో అందరి జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇకపై ఇష్టం వచ్చినట్టు బయట తిరగడం కానీ , తినడం కానీ చేయడం అంత మంచిది కాదు. పక్క వారితో మాట్లాడాలి అన్నా కూడా భయపడాల్సిన సమయం వచ్చేసింది. ఇలా గతంతో పోలిస్తే మనిషి జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే కూడా కరోనా రహిత రైలు కోచ్ ను రూపొందించింది. అదే పోస్ట్ కోవిడ్ కోచ్.
ఇది దేశంలోనే మొట్టమొదటి పోస్ట్ కోవిడ్ కోచ్. ఈ రైలు ఇన్నిరోజులు మనం చూసిన రైలు బోగీలా ఉండదు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రైలు బోగీ ఈ పోస్ట్ కోవిడ్ కోచ్. ఈ కోచ్ పూర్తిగా కరోనా రోహిత కోచ్ గా తయారుచేయబడింది. అలాగే దీన్ని చేతులతో ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వాష్ బేసిన్ దగ్గర్నుంచి వాష్ రూమ్ వరకు .. వాటర్ ట్యాప్, ఫ్లష్ వాల్వ్ , సోప్ డిస్పెన్సర్, వాష్‌రూమ్ డోర్ వంటివాటిని చేతితో తాకుండా కాలితోనే ఆపరేట్ చేసేలా తయారు చేశారు. హ్యాండిల్స్ కు ఇదివరకటిలా స్టీల్ వి కాకుండా కాపర్ కోటింగ్, టైటానియం డయాక్సైడ్ కోటింగ్ ఉంటుంది.
ఒకవేల కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఆ ప్రదేశాల్లో తాకినా వైరస్ కొన్ని గంటల్లో అది చనిపోతుంది. కాపర్ కు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక ఏసీ కోచ్ లో ప్లాస్మా ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. గాలిలో, ఉపరితలాలపై క్రిములను నాశనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న పోస్ట్ కోవిడ్ కోచ్ లు త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి.