Begin typing your search above and press return to search.
కరోనా టైం లో భారత రైల్వే శాఖ రికార్డు .. ఏ విషయంలో అంటే !
By: Tupaki Desk | 2 Jun 2021 6:30 AM GMTదేశంలో ఓ కరోనా మహమ్మారి విజృంభణ, మరోవైపు కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్, దీనితో ప్రపంచం మొత్తం ఎక్కడిక్కడ స్తంభించింది. వ్యాపారాలు అన్ని కూడా ఆగిపోయాయి. కోట్ల కొద్ది నష్టపోయారు. ఎంతోమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. అయితే , ఇలాంటి సమయంలో భారతీయ రైల్వే మరో రికార్డు సృష్టించింది. మే నెలలో అత్యధికంగా సరుకుల రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ సంక్షోభం సమయంలో మే నెలలో 114.8 మిలియన్ టన్నులు రవాణా చేసింది. మే 2019లో 104.6 టన్నుల సరుకు రవాణా చేసింది.
ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. 2019 మేతో పోలిస్తే ఇది 9.7 శాతం అధికమని అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేకు గత నెలలో ఆదాయం, సరుకు రవాణా ఎక్కువగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మే నెలలో చేసిన మొత్తం సరుకు రవాణాలో 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఇనుప రజను, 5.61 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల మినరల్ అయిల్, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్, 4.2 మిలియన్ టన్నుల క్లింకర్ ఉన్నట్టు రైల్వే పేర్కొంది. ఫలితంగా గత నెలలో 11,604 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మే నెలలో వేగన్ టర్న్ అరౌండ్ టైమ్ 26 శాతం మెరుగైందని రైల్వే తెలిపింది. 2019 మేలో ఇది 6.46 రోజులుగా ఉండగా, మే 2021లో అది 4.81 శాతానికి తగ్గింది. అలాగే, గత 18 నెలలుగా సరుకు రవాణాలో వేగం పెరిగిందని రైల్వే తెలిపింది.