Begin typing your search above and press return to search.

ఎలుకల పేరుతో రూ.5.89కోట్లు స్వాహా!

By:  Tupaki Desk   |   10 Oct 2019 7:09 AM GMT
ఎలుకల పేరుతో రూ.5.89కోట్లు స్వాహా!
X
ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి అక్షరాల రూ.22300 ఖర్చు. మొత్తం రైల్వే స్టేషన్లు, బోగీలలోని ఎలుకలను పట్టడానికి అయిన ఖర్చు రూ.5.89 కోట్లు. ఇదీ ఘనత వహించిన మన రైల్వేశాఖ అధికారుల ఘనకార్యం. ఎలుకను పట్టుకోవడానికి 22 వేలు ఖర్చు చేసిన వైనం ఇప్పుడు దుమారం రేపుతోంది.

రైల్వే బోగీలు, స్టేషన్లలో ఎలుకలతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉపశమనం కలిగించడానికి రైల్వే శాఖ అధికారులు ఎలుకలను పట్టడానికి డిసైడ్ అయ్యారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసిన వైనం విస్తుగొలుపుతోంది.

తాజాగా ఈ ఎలుకలు పట్టడానికి ఎంత ఖర్చు అయ్యిందని ఓ ఆర్టీఐ ఉద్యమకారుడు రైల్వే అధికారులకు దరఖాస్తు చేసుకోగా ఒక్కో ఎలుకకు రూ.22,300 చొప్పున మొత్తం 2016 మే నుంచి 2019 ఏప్రిల్ వరకు బోగీలు, స్టేషన్లలో ఎలుకలను పట్టుకోవడానికి ఏకంగా రూ.5.89 కోట్లు ఖర్చు అయ్యిందని సమాధానం ఇచ్చారు. ఒక్క ఎలుకకు ఇంత భారీగా ఖర్చు చేసిన వైనం చర్చనీయాంశమైంది. 2018-19లోనే మొత్తం 2636 ఎలుకలు పట్టుకున్నట్టు అధికారులు లెక్కులు చూపారు.

ఎలుకలను పట్టుకోవడానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం మీడియాలో దుమారం రేపింది. దీనిపై తమిళ మీడియా సంస్థలు చెన్నై రైల్వే స్టేషన్ సీపీఆర్వో, సీనియర్ పీఆర్వోలను వివరణ అడిగినా వారు స్పందించలేదు. మొత్తం మీద ఎలుకల పేరుతో స్వాహ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.