Begin typing your search above and press return to search.
ఎన్నారైలకు రైల్వేల బంపర్ ఆఫర్!
By: Tupaki Desk | 3 July 2017 7:30 PM GMTఎన్నారైలు.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా కేంద్ర రైల్వే శాఖ ఊహించని రీతిలో సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు.. ఎన్నారైలు రైల్వే టిక్కెట్ల కోసం ఇబ్బంది పడకుండా 360 రోజులకు ముందే రిజర్వేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటివరకూ ఈ అవకాశం 120 రోజులు ఉండగా.. ఆ స్థానంలో మరింత ముందుగా టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే వీలు ఉండనుంది.
ఈ వారంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించే వీలుందని చెబుతున్నారు. తాజా నిర్ణయంతో విదేశీయుల్ని మరింత ఎక్కువగా ఆకర్షించే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఈ రిజర్వేషన్ కు మరో ముఖ్యమైన అంశం ముడిపడి ఉంది. అదేమంటే.. విదేశీ ప్రయాణికులు మెయిల్.. రాజధాని.. శతాబ్ది.. గతిమాన్.. తేజస్ రైళ్లలోని ఫస్ట్.. సెకండ్ ఏసీ.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ల టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంది.
థర్డ్ క్లాస్.. స్లీపర్ క్లాస్ లలో మాత్రం రిజర్వ్ చేసుకునే వెసులుబాటు ఉండదు. దీంతో.. భారతదేశానికి రావటానికి ముందుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే వారికి మరింత వెసులుబాటు కలుగనుంది. అదే సమయంలో చివరి నిమిషంలో ప్రయాణానికి వీలుగా ఉన్న సువిధ రైళ్లలో కూడా విదేశీయులు టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉండదు. ఏమైనా.. రైల్వేల నిర్ణయం విదేశీ పర్యాటకుల్ని అమితంగా ఆకర్షించేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/