Begin typing your search above and press return to search.
చైనా బోర్డర్‌లో ఇండియా రైల్వేస్టేషన్
By: Tupaki Desk | 13 April 2015 8:37 AM GMTఏమాటకు ఆ మాటే చెప్పాలి.. మోడీ ప్రధానమంత్రి అయ్యాక విదేశాంగ విధానంలో చాలానే మార్పు వచ్చింది. వివిధ దేశాలతో వ్యవహరించే తీరులోనూ దూకుడును ప్రదర్శించే ధోరణి కనిపిస్తుంది. లాలించి బుజ్జగించినట్లుగా ఉంటూనే.. అవసరానికి తగినట్లుగా ధృడంగా వ్యవహరించే ధోరణి భారత్ వైఖరిలో స్పష్టంగా కనిపించటం గమనార్హం.
భారతదేశం విషయంలో చైనా అనుసరించే వ్యూహాత్మక ధోరణి ఇప్పటికే ఎన్నోసార్లు ఉదాహరణలతో సహా కనిపించాయి. భారత్‌ను నిలువరించేందుకు వీలుగా.. భారత్ సరిహద్దుల్లో చైనా రోడ్డు నిర్మాణం చేపట్టటం మొదలు.. భారత్ భూభాగంలోకి చొచ్చుకు రావటం లాంటివి చాలానే చేస్తుంటుంది. దీనిపై నిరసన వ్యక్తం చేయటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి.
మన సరిహద్దుల్లో రోడ్లు.. భవన నిర్మాణాలు లాంటివి ఎంత ఇబ్బందికరంగా ఉంటాయన్న విషయాన్ని చైనాకు తెలియజేసేలా మోడీ సర్కారు తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. చైనా సరిహద్దులకు సమీపంలో భారత్ ఒక రైల్వేస్టేషన్ నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులకు దగ్గరగా ఒక రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఒప్పంద కాపీని సైతం సిద్ధం చేశారు. త్వరలో సదరు రైల్వేస్టేషన్‌నిర్మాణం స్టార్ట్ అవుతుందన్న వాదన వినిపిస్తోంది.