Begin typing your search above and press return to search.

ఇక.. అప్పర్‌ బెర్త్‌ ఈజీగా ఎక్కేయొచ్చు

By:  Tupaki Desk   |   23 Jun 2015 3:23 PM IST
ఇక.. అప్పర్‌ బెర్త్‌ ఈజీగా ఎక్కేయొచ్చు
X
రైలు ప్రయాణంలో.. అందునా రిజర్వేషన్‌ కోచ్‌లలో ప్రయాణించే సమయంలో అప్పర్‌ బెర్త్‌లు ఎక్కటానికి పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. మధ్య వయస్కుల వరకూ ఫర్లేదు కానీ.. కాస్తంత వయసు మీద పడిన వారి పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. పైకి ఎక్కలేక.. కిందకు దిగలేక.. ప్రయాణం ఒక నరకంగా పీలయ్యే పరిస్థితి.

ఏళ్లకు ఏళ్లుగా.. ఈ సమస్యపై దృష్టి పెట్టని రైల్వే శాఖ తాజాగా దీనిపై దృష్టి సారించటమే కాదు.. పరిష్కారం నుగొంది కూడా. అప్పర్‌ బెర్త్‌ ఎక్కేందుకు వీలుగా.. ఇబ్బంది లేకుండా ఉండేలా సరికొత్త మెట్లను రూపొందించారు. ఒక్కో బోగీకి రూ.20వేల ఖర్చుతో కొత్త తరహా మెట్లను రూపొందించారు.

వీటితో సులువుగా ఎక్కటంతో పాటు.. పాదం పెట్టేందుకు అనువుగా ఉండటం ఈ నిచ్చెన ప్రత్యేకత. ఇప్పటికే ఈ తరహా నిచ్చెనల్ని కొన్ని రైళ్లలోని ఏసీ బోగీల్లో ఏర్పాటు చేశారు. వీటికి సానుకూల స్పందన రావటంతో.. మిగిలిన రైళ్లలోనూ ఇదే విధానాన్ని దశల వారీగా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. అదే జరిగితే.. అప్పర్‌ బెర్త్‌ ఎక్కే కష్టాలకు చెల్లుచీటి ఇచ్చేసినట్లే. మరి.. ఈ కొత్త విధానాన్ని అన్ని రైళ్లకు ఎప్పుడు అమలు చేస్తారో చూడాలి.