Begin typing your search above and press return to search.

రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ఫలితం.. క్షీణించిన రూపాయి..

By:  Tupaki Desk   |   7 March 2022 9:33 AM GMT
రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ఫలితం.. క్షీణించిన రూపాయి..
X
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. యుద్ధం జరిగేది ఈ రెండు దేశాల మధ్యే అయినా ఈ ప్రభావం మిగతా దేశాలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే రష్యా ఆట కట్టించాలని యూరోపిన్ దేశాలు ఆ దేశంపై రకరకాల ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో రష్యా నుంచి ఇతర దేశాలకు ఎలాంటి రవాణా లేకుండా పోయింది. ఫలితంగా రష్యా నుంచి అవసరముంటే వస్తువుల కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి.

ఇక రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉంటూ వస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్ కు దూరంగా ఉంది. అయినా భారత్ పై ఈ ప్రభావం బాగానే ఉంది. సోమవారం నాటి షేర్లు విపరీతంగా డౌన్ అయ్యాయి. అటు కమోడీటీస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా భారత రూపాయి కనిష్టంగా 77.02 యూఎస్ డీ కి చేరింది.

భారత్లో సోమవారం షేర్స్ డౌన్ తోనే ప్రారంభమయ్యాయి. అధిక ద్రవ్యోల్భణం, చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రూపాయి విలువ పడిపోయింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 1శాతం కోల్పోయి 76.87గా నమోదైంది. ‘పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా అధిక వాణిజ్య లోటుల ఆందోళనతో భారత రూపాయి బలహీనపడిందని అదనంగా హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీ రిటైల్ రీసెర్చ్ డిప్యూటీ హెడ్ దేవర్స్ వకీల్ ఈ సందర్భంగా అన్నారు. సెంటిమెంట్ పై దిగజారుతున్న ప్రమాదం పెద్ద ఐపీఓ ఫండ్ ను వాయిదా వేయడానికి దారితీసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ప్రపంచంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం నాటి బ్యారెల్ ధర 130 డాలర్లుగా ఉంది. సోమవారం ఉదయం 11.66 డాలర్లు లేదా 9.88 శాతం ఎగిసి 129.60 డాలర్ల వద్ద వెస్ట్ టెక్సాన్ ఇంటర్మీడియెట్ 9.90 డాలర్లు లేదా 8.56 శాతం లాభపడింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగితే బ్యారెల్ ధర 150 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

అటు బంగారం ధరలు భగభగమంటున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్భణం కారణంగా పసిడి రూ.53 వేలకు క్రాస్ చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈవారం 54వేలకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆగిపోతే మాత్రం 50 వేలకు చేరుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక వెండి ధరలు సైతం జోరందుకున్నాయి.

స్టాక్ మార్కెట్లు కొన్ని రోజులుగా నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. దీంతో దేశీయంగా ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు ఏర్పడిందని అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మాకాల ఒత్తిడి పెరగడంతో దేశీయంగా పీఎంఐ 54.9కి, సర్వీస్ పీఎంఐ 51.8 పాయింట్లకు చేరింది. ఇందుకు ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధమే కారణమని అంటున్నారు.