Begin typing your search above and press return to search.

డాలర్ 90 రూపాయలకి పోయే చాన్స్ ఉందా?

By:  Tupaki Desk   |   4 May 2020 5:40 PM IST
డాలర్ 90 రూపాయలకి పోయే చాన్స్ ఉందా?
X
మనకు రూపాయి ఎలాగో.. అమెరికాలో వారికి ఒక డాలర్ అలాగే. పైసలను బట్టి చూస్తే రెండూ సేమే.. కానీ విలువలో మాత్రం డాలర్ ఎంతో ఎత్తున ఉంటే.. మన రూపాయి అథ: పాతాళంలో ఉంది. ఒక్క డాలర్ తో పోల్చిచూస్తే రూపాయి ఏకంగా రూ. 76.26కి ఈరోజు చేరింది. చూస్తుంటే ఇది త్వరలోనే రూ.90కి చేరడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్ళీ బలపడటం విశేషంగా చెప్పవచ్చు. 4 రోజుల వరుస ర్యాలీకి ఈరోజు బ్రేక్‌పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.71 వద్ద ప్రారంభమైంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూపాయి 75.10 వద్ద ముగిసింది. గత 4 రోజులుగా బలపడుతోన్న రూపాయి మళ్ళీ షరామామూలుగా బలహీనపడింది. ప్రస్తుతం 72 పైసలు బలహీనపడి 76.26 స్థాయి వద్ద రూపాయి ట్రేడవుతోంది.

మరోవైపు బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి.10 గ్రాముల బంగారం ధర 45,545 రూపాయలకు, కిలో వెండి ధర 41270కు చేరాయి. ఇక ఎంసీఎక్స్‌లో క్రూడాయిల్‌ ధర 5శాతం తగ్గింది.

ప్రస్తుత కరోనా వైరస్ ఆ తరువాత పరిణామాలు చూస్తుంటే మన రూపాయిలు బలహీనపడి ఒక్క డాలర్ కు రూ.90కి చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ద్రవోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు సహా మనం విదేశాల నుంచి కొనే వస్తువుల ధరలు పెరిగి మనపై తీవ్ర భారం పడడం ఖాయం. క్రూడ్ ఆయిల్ కు అధికంగా రూపాయిలను వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావచ్చని.. ఇది దేశ ఆర్థికరంగానికి పెద్ద బొక్క అని చెబుతున్నారు.