Begin typing your search above and press return to search.
కోహ్లీ..ధోనీ.. యువరాజ్ రోజూ తినేదేంటి?
By: Tupaki Desk | 10 July 2016 3:56 PM GMTకోహ్లీ.. ధోనీ.. యువరాజ్.. కోట్లాదిమంది వారిని అమితంగా ఆరాధిస్తారు.. ప్రేమిస్తారు. వారు బాగా ఆడితే ఎంతలా సంబరపడతారో.. ఆడకుంటే అంతేలా బాధ పడిపోతుంటారు. వారి వైఫల్యం వారిదిగా కాకుండా.. తామే పర్సనల్ గా ఫెయిల్ అయినట్లుగా ఫీలవుతారు. మరి.. అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న వారు.. ఫిట్ నెస్ కోసం అనుక్షణం తపిస్తుంటారు. తమకు ఇంతమంది అభిమానుల్ని ఇచ్చిన ఆట విషయంలో వారు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరు. అందుకోసం త్యాగాలు చేయటానికి సైతం సై అంటారు. నోరూరించే ఎన్నో ఫుడ్స్ తమ చుట్టూ ఉన్నా వారు మాత్రం ఆచితూచి.. సెలెక్టివ్ గా ఉంటారు. ఆరోగ్యానికి హాని చేసే వాటి సంగతి వదిలేస్తే.. ఫిట్ నెస్ ను దెబ్బేసే ఏ వస్తువును దగ్గరకు రానివ్వరు.ఇలాంటి స్టార్ ఆటగాళ్లు నిత్యం తీసుకునే మెనూ ఎలా ఉంటుందంటే..
కోహ్లీ
టూర్లలో ఉంటే బయట ఫుడ్ తినాల్సిందే. ఇంట్లో ఉంటే మాత్రం బయటకు వెళ్లేందుకు అస్సలు ఇష్టపడడు. ఇంట్లో అయినా బయటైనా సరే తీసుకునే ఫుడ్ లో చేపల కూర ఉండాల్సిందే. అది కూడా పింక్ సాల్మన్ డిష్ తప్పనిసరి. అది లేదనుకుంటే లాంబ్ చావ్.. అదేనండి గొర్రెపిల్ల మాంసం ఉండాల్సిందే. సాల్మాన్ చేపలతో చేసిన ఫుడ్ ఖరీదెక్కువ. ప్లేటు రూ.3వేలకు పైనే ఉంటుంది. అయినా.. వాటిలో ఉంటే.. విటమిన్లూ.. ఖనిజ లవణాలు.. ఒమేగా 3 ఫ్యాటీ అమ్లాలు ఫుల్ గా ఉండటంతో వాటికే తన ఓటు వేస్తాడు. ఇక రోజూ మొత్తం సలాడ్ల మీద బతికేస్తుంటాడు. ఫాస్ట్ ఫుడ్ ని దగ్గరకు రానివ్వడు. నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. కోహ్లీ వాటర్ తాగాలంటే ఫ్రాన్స్ నుంచి తెప్పించుకునే ఎవియాన్ మినరల్ వాటర్నే తీసుకుంటాడు. ఈ నీళ్ల ఖరీదు వింటే షాక్ తప్పదు. లీటర్ వాటర్ జస్ట్ రూ.600 మాత్రమే.
ధోనీ
రోజు గడిచిందంటే ధోనీ ఐదు లీటర్ల పాలు తాగినట్లే. పాలు.. పాల ఉత్పత్తుల అంటే అతగాడికి మహా ఇష్టం. ఎందుకంటే.. పాలల్లో ఉండే కాల్షియంతో ఎముక మరింత బలంగా తయారు అవుతుందని. అలా అని మితిమీరి తీసుకోవటానికి ఇష్టపడడు. ఎందుకంటే కొవ్వు దరి చేరుతుందన్న భయమే. ఉదయం పాలతో చేసిన పారిడ్జ్.. డ్రైఫ్రూట్స్ తీసుకుంటాడు. రోజులో ఎక్కువసార్లు ప్రోటీన్ షేక్స్.. తాజా పండ్ల రసాలు తీసుకునేందుకు ఇష్టపడతాడు. భోజనంలో అన్నం.. పప్పు.. చపాతీ.. చికెన్ ఉండాల్సిందే. చిరుతిండ్లు తినాల్సి వస్తే డ్రైఫ్రూట్స్ ను తీసుకుంటాడు.
యువరాజ్
క్యాన్సర్ తర్వాత యువరాజ్ మెనూ మొత్తంగా మారింది. ఉదయం సెరియల్స్.. పండ్లూ వచ్చేశాయి. అన్నానికి బదులు బ్రౌన్ రైస్.. గోధుమపిండికి బదులు గ్లూటెన్ ఫ్రీ గోధుమ పిండితో తీసుకున్న చపాతీలనూ తీంటున్నాడు. మధ్యలో గడ్డు.. చికెన్.. పాలు తీసుకుంటాడు. కార్పొభైడేడ్రూల.. ప్రొటీన్లు అధికంగా ఉన్న ఫుడ్ కే ఓటేస్తాడు.
రోహిత్ శర్మ
మొదట్లో బొద్దుగా ఉండే రోహిత్ బరువు తగ్గటానికి ఉడికించిన గుడ్లనే తినేవాడు. రాత్రిళ్లు ఆలస్యంగా తినటం.. జంక్ పుడ్స్ ను బంద్ చేసేశాడు. రాత్రి ఎనిమిదింటిలోపే భోజనం చేసేయటం.. తర్వాత ఏమీ తీసుకోకుండా ఉంటాడు. ఉదయం పాలతో కలిపిన ఓట్స్.. ప్రోటీన్ డ్రింక్స్ ను తీసుకుంటాడు. కొర్బొహైడ్రేడ్లు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకోవటం.. ప్రోటీన్ షేక్ లను ఎక్కువగా తీసుకుంటాడు.