Begin typing your search above and press return to search.

ఇండియన్సుతో స్టార్టప్ లు పెట్టిస్తున్న ట్రంప్

By:  Tupaki Desk   |   17 Feb 2017 5:36 AM GMT
ఇండియన్సుతో స్టార్టప్ లు పెట్టిస్తున్న ట్రంప్
X
హెచ్1బీ వీసాలపై ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ వంటి నిర్ణయాలతో భారతీయులను హడలెత్తించిన ట్రంప్ తన కొత్త నిర్ణయంతో మాత్రం కొందరు ఇండియన్సును సంతోషపెడుతున్నాడట. ఇష్టంగానో, కష్టంగానో వారితో అమెరికాలో పెట్టుబడులు పెట్టించి వ్యాపారాలు పెట్టిస్తున్నాడు. దీంతో అమెరికాలో బాగా స్థిరపడాలనుకుంటున్న భారతరీయులంతా ఇప్పడు కొత్తగా కంపెనీలు పెట్టేస్తున్నారట. దీనికోసం ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను వారు బాగా వాడుకుంటున్నారు.

ఆ ఆఫర్ పేరు ఈబీ-5 వీసా ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో వారానికి మినిమం ముగ్గురు భారతీయులు చేరుతున్నారట. ఈబీ-5 వీసా ప్రోగ్రాం అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలనుకునే విదేశీయులు మిలియన్ డాలర్ల పెట్టుబడితో స్టార్టప్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రభుత్వం ఆమోద ముద్రవేస్తే... ఆ స్టార్టప్ లో కనీసం పది మంది రూరల్ అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలి. అలా చేస్తే స్టార్టప్ పెట్టిన వారికి అమెరికాలో శాశ్వత నివాసానికి (గ్రీన్ కార్డు) అర్హత లభిస్తుంది. అలా కాని పక్షంలో ప్రభుత్వం అప్రూవ్ చేసిన బిజినెస్ లో 3.7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అలా చేస్తే ప్రభుత్వమే పది మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తుంది. ఈ మొత్తం మళ్లీ వెనక్కి కావాలనుకుంటే ఐదేళ్ల తరువాత తన డబ్బును ఉపసంహరించుకోవచ్చట.

అయితే, దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాకున్నా చాలామంది మాత్రం చేరిపోతున్నారు. ఈ ప్రోగ్రాంలో చేరడానికి ఇప్పటి వరకు 210 మంది సంతకాలు పెట్టగా, అందులో 42 భారతీయులే. బెయిన్‌ - రిలయన్స్ - ఆదిత్య బిర్లా - మెక్‌ కిన్సే లాంటి కంపెనీల్లో పెద్ద స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు - వ్యాపార కుటుంబాలు ఈ దరఖాస్తుల్లో సంతకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇది బ్లాక్ మెయిల్ చేసి పెట్టుబడులు పెట్టించడం తప్ప ఇంకేమీ కాదని క్లియర్ గా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/