Begin typing your search above and press return to search.

మోడీ ప్యాకేజీ ఎఫెక్ట్ ... భారీ నష్టాల్లో మర్కెట్స్ !

By:  Tupaki Desk   |   18 May 2020 11:10 AM GMT
మోడీ ప్యాకేజీ ఎఫెక్ట్ ... భారీ నష్టాల్లో మర్కెట్స్ !
X
భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవలే ప్రజల కోసం ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ఉద్దీపన పేరుతో ప్రకటించినప్పటికీ కూడా ఇన్వెస్టర్లను పెద్దగా ఆకట్టుకోవడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదు లభ్యత కోసం వారంతా ఎదురు చూస్తుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరంభంలోనే ఏకంగా 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయి నెల రోజుల కనిష్ట స్థాయిని తాకింది

అలాగే మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్ ‌డౌన్ ను పొడగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో , ఆ నిర్ణయం కూడా ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 941 పాయింట్లు కోల్పోయి 30161 వద్ద, నిఫ్టీ 268 పాయింట్లు కోల్పోయి 8868 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్‌ 30750 స్థాయిని కోల్పోగా, నిఫ్టీ కీలకమైన 9 వేల దిగువకు పడిపోయింది. మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోతుండగా మరోవైపు ఐటీసీ, వేదాంత, ఇన్ఫోసిస్‌, ఇన్ఫ్రాటెల్‌, సిప్లా షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.