Begin typing your search above and press return to search.

ఇండియన్ స్టూడెంట్స్ మేడ్ ఫర్ అమెరికా

By:  Tupaki Desk   |   18 Nov 2015 5:30 PM GMT
ఇండియన్ స్టూడెంట్స్ మేడ్ ఫర్ అమెరికా
X
పై చదువులు కోసం అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గత 60 ఏళ్ల చరిత్రలో రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా వెళుతున్న ఇండియన విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం 29.4 శాతం పెరిగిందని ఓపెన్ డోర్స్ రిపోర్టు తెలిపింది. ప్రతి ఏటా లక్షా 2 వేలమంది విద్యార్థులు పై చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. దీంట్లో అమెరికాదే అగ్రస్థానం.

2014-15 సంవత్సరంలో 30 వేలమంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. ప్రపంచంలో ఏ దేశంనుంచీ ఇంతమంది విద్యార్తులు అమెరికా వెళ్లలేదు. 1954-55లో అమెరికా ఓపెన్ డోర్స్ విధానాన్ని ప్రారంభించాక ఒక సంవత్సరంలో ఒకే దేశం నుంచి ఇంతమంది విద్యార్ధులు విద్యకోసం అమరికా రావడం ఇదే తొలిసారి. దేశంలోని ఇంటర్నేషనల్ స్కూల్స్‌ లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతుంటడమే దీనికి కారణం.

గత సంవత్సరం అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో 6.11 శాతం మాత్రమే పెరుగుదల నమోదయింది. గత పదేళ్లకాలంలో అమెరికాలో విద్యకు ప్రాధాన్యమిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య అమాంతంగా 73.7 శాతం పెరిగింది. ఒక విద్యార్థి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నేరుగా డాక్టరేట్ కోర్సులో చేరడానికి భారత్‌ లో వీలుపడదు. ఏ రంగంలోనైనా పీహెచ్‌ డీ చేయాలంటే డిగ్రీ పూర్తయ్యాక తప్పనిసరిగా మన దేశంలో మాస్ట్రర్ డిగ్రీ చదవాల్సిందే. ఇది అందరు విద్యార్థులకూ ముందు షరతు.

కాని అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తయిన తర్వాత ఎవరైనా పీజీ కోర్సు లేకుండానే పీహెచ్‌ డీ చేయడానికి వీలుంది. దీంతో భారతీయ విద్యార్థులు అమెరికాలో చదివేందుకు ఉత్సాహం చూపుతున్నారని యూఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ రియాన్ పెరీరా చెప్పారు.