Begin typing your search above and press return to search.
అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ గురుభక్తి
By: Tupaki Desk | 24 May 2017 8:29 AM GMTభారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ ఆచారాలు సంప్రదాయాలను అంతవేగంగా మర్చిపోరు. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురు దేవో మహేశ్వర: అన్నది భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. మన దేశంలో తల్లి, తండ్రి తరువాత అంత గొప్ప స్థానం గురువుకే ఉంది. అందుకేనేమో అమెరికాలో విద్యాభ్యాసం చేసిన ఓ కుర్రాడు తన గురువు పాదాలకు నమస్కరించి గురు భక్తి చాటుకున్నాడు. అయితే... ఇలాంటి సంప్రదాయాల గురించి తెలియని ఆ గురువు ఆ ఘటనతో ఆశ్చర్యానికి లోనయ్యారు.
అమెరికాలోని షికాగోలో ఉన్న ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గౌరవ్ ఝవేరీ అనే కుర్రాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కోర్సు పూర్తయిన తరువాత పట్టాలను ప్రధానం చేశారు. ఆ సందర్భంగా పట్టా అందుకున్న తరువాత గౌరవ్ తన డీన్ పాదాలను చేతులతో తాకాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే... మారిన కాలంలో... అందునా అమెరికా వంటి దేశంలో ఇలా చేయడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. గౌరవ్ తన పాదాలకు నమస్కరించగానే డీన్ కు ఏమీ అర్థం కాలేదని... ఆయన ఎందుకలా చేస్తున్నాడో తెలియక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా భారతీయులేనని ఈ ఘటన నిరూపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. మొత్తానికి అమెరికా ఆచార్యుడి పట్ల భారతీయ విద్యార్థి గురు భక్తి మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది.