Begin typing your search above and press return to search.

అమెరికాలో చైనా కంటే మ‌న‌మే టాప్‌

By:  Tupaki Desk   |   15 Nov 2016 5:40 AM GMT
అమెరికాలో చైనా కంటే మ‌న‌మే టాప్‌
X
అమెరికాకు వ‌ల‌స‌ వచ్చే వారిని క‌ట్ట‌డి చేసే దిశ‌గా అమెరికా కొత్త అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణ‌యాలు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలోనే ఊహించ‌ని వార్త ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. ట్రంప్ అధ్య‌క్షుడిగా ఎన్నికైతే వీసాలు పొందేందుకు నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేయ‌డం - ఫీజుల పెంపు - పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయ‌డం వంటివి స‌మ‌స్య‌లు ఉంటాయ‌నే వాదోప‌వాదాలు వినిపిస్తున్న స‌మ‌యంలోనే ఏకంగా 25శాతం భార‌తీయ‌ విద్యార్థులు అమెరికా బాట ప‌ట్టారు. ఈ వివ‌రాల‌ను సాక్షాత్తుగా అమెరికా వెల్ల‌డించింది.

వ‌రుస‌గా రెండో ఏడాది కూడా అమెరికాకు వ‌ల‌స‌వెళ్లే విద్యార్థుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింద‌ని ఆ దేశ నివేదిక వివ‌రించింది. అమెరికాలోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల్లో డిగ్రీ - పీజీ చ‌దువుతున్న విద్యార్థులు గ‌త ఏడాది 1,33,000 మంది ఉండ‌గా 2015-16 విద్యాసంవ‌త్స‌రంలో 1,66,000 మంది ఉన్నారు. అమెరికాలో చ‌దువుతున్న ప్ర‌తి ఆరుగురు విదేశీ విద్యార్థుల్లో ఒక‌రు భార‌తీయ విద్యార్థే. మొత్తం విదేశీ విద్యార్థుల్లో స‌హ‌జంగానే మ‌న పొరుగుదేశ‌మైన చైనా ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం అమెరికాలో 3,28,000 మంది చైనా జాతీయ‌త క‌లిగిన వారు విద్య అభ్య‌సిస్తున్నారు. అయితే భార‌త‌దేశం నుంచి గ‌త ఏడాది విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థులు 25 శాతం ఉండ‌గా చైనా నుంచి వెళ్లిన వారు 8శాత‌మే. మొత్తంగా అమెరికాకు గ‌త ఏడాది వ‌ల‌స వ‌చ్చిన వారి 7శాతం పెరిగారు. వీరి రాక‌తో అమెరికాకు 36 అమెరికా బిలియ‌న్ల డాల‌ర్ల ఆదాయం స‌మ‌కూరింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/