Begin typing your search above and press return to search.
ఇండియన్సు రాకుంటే అమెరికా పతనమే
By: Tupaki Desk | 18 March 2017 8:46 AM GMTఇమ్మిగ్రేషన్ కు వ్యతిరేకంగా ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నిపుణులే కాకుండా భారతీయులూ ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే... అమెరికాలోని అందరు రాజకీయ నేతలూ ఒకేలా లేరు.. ఇన్నోవేషన్, రీసెర్చి రంగాల్లో అమెరికా ఆధిపత్యం కొనసాగాలంటే ఇండియన్స్ కచ్చితంగా అవసరమని.. వారి ప్రతిభ తోడుగా లేకుంటే అమెరికా డామినేషన్ అసాధ్యమని అమెరికాలోని ప్రముఖ సెనేటర్ ఒకరు చెప్పడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. భారతీయ విద్యార్థులకు టెక్ డిగ్రీతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వాలన్నది ఆ సెనేటర్ డిమాండు.
నార్త్ కరోలినా సెనేటర్ థామస్ టిల్లిస్ అమెరికాలో ఇమ్మిగ్రేషన్ గొడవలపై మాట్లాడుతూ భారతీయులకు మద్దతు పలికారు. వారు లేకుండా ఇండియా టాప్ పొజిషన్ నిలబడదని తేల్చేశారు. తమకు భారతీయ ప్రతిభ కావాలని, ఇనోవేషన్, రీసెర్చ్ లో టాప్ లో ఉండాలంటే భారతీయులతో ఉద్యోగాలను భర్తిచేసుకోవడం తప్పనిసరని ఆయన అన్నారు.
ఇండియన్ అమెరికన్లు ఏర్పాటుచేసిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన అక్కడ మాట్లాడుతూ... ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ విద్యార్థులకు డిగ్రీలతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆయన మొగ్గుచూపారు.
తమ ఆర్థికాభివృద్ధిని మూడు నుంచి నాలుగు శాతానికి పెరిగేలా చేయడానికి హైటెక్ జాబ్స్, అడ్వాన్స్ డ్ డిగ్రీలు, అడ్వాన్స్ డ్ అనాలిటిక్స్, సైన్సు అండ్ రీసెర్చ్ ల్లో మానవ వనరులు అవసరమన్నారు. ఈ ఉద్యోగాలు వినూత్న దేశంగా అమెరికా ఉనికి మరింత చాటడానికి, పోటీ ప్రపంచంలో అమెరికాను అగ్రస్థానంలో కొనసాగించేందుకు ఎంతో అవసరమని చెప్పారు. సెనేట్ జ్యుడిషియరీ కమిటీకి సభ్యుడైన టిల్లిస్, వీసాలకు సంబంధించిన ఇమిగ్రేషన్ పాలసీలో సవరణలకు ఎంతో కీలకపాత్ర పోషించారు. హెచ్-1బీ వీసా ప్రక్రియలో అదనపు మార్పులు తీసుకురావాలని అమెరికా కాంగ్రెస్ లో ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్న సమయంలో టిల్లిస్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/