Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో భార‌తీయుడిపై విద్వేష దాడి

By:  Tupaki Desk   |   23 May 2017 6:55 AM GMT
ఆస్ట్రేలియాలో భార‌తీయుడిపై విద్వేష దాడి
X
మ‌రో విద్వేష దాడి జ‌రిగింది. ఆస్ట్రేలియాలో భార‌తీయుడిపై అక్క‌డి ఒక జంట దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఆస్ట్రేలియాలోని టాస్మానియా.. సాండీ బే వ‌ద్ద జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌దీప్ సింగ్ అనే భార‌తీయుడు తీవ్ర గాయాల‌కు గుర‌య్యారు. విద్వేష దాడి ఎలా చోటు చేసుకున్న‌ద‌న్న‌ది చూస్తే..

భార‌త్‌ కు చెందిన ప్ర‌దీప్ సింగ్ ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తుంటారు. శ‌నివారం రాత్రి టాస్మానియా సాండీ బే వ‌ద్ద ఒక జంట ప్ర‌దీప్ పై దాడికి పాల్ప‌డింది. కారులో ప్ర‌యాణించే స‌మ‌యంలో స‌ద‌రు మ‌హిళ వాంతి చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఆమెను ట్యాక్సీ దిగాల‌ని ప్ర‌దీప్ సూచించాడు. ఒక వేళ వాంతి చేసుకుంటే శుభ్రం చేసుకునేందుకు రుసుము చెల్లించాల‌న్నాడు.

అయితే.. అందుకు నిరాక‌రించిన ఆ జంట ప్ర‌దీప్ జాతీయ‌త‌ను ఉద్దేశించి దారుణ విమ‌ర్శ‌లు చేయ‌టంతో పాటు.. అత‌డిపై దాడికి దిగారు. స‌ద‌రు జంట చేసిన దాడితో ప్ర‌దీప్ సింగ్ అప‌స్మార‌క స్థితికి చేరుకున్నాడు. జాతి విద్వేషంతో చేసిన ఈ దాడిని ప‌లువురు ఖండిస్తున్నారు. గాయాల‌పాలైన ప్ర‌దీప్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు. ఈ ఉదంతంపై ఆస్ట్రేలియా పోలీసులు కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.