Begin typing your search above and press return to search.
ఫ్లోరిడా కాల్పులు..విద్యార్థులను కాపాడిన మన టీచర్
By: Tupaki Desk | 17 Feb 2018 8:05 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో పాఠశాలలో కాల్పుల ఉదంతం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడా స్కూల్‌లో ఈనెల 14వ తేదీన ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు. డగ్లస్ స్కూల్ లో ఆ మారణహోమం జరిగింది. అయితే ఆ స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్న భారతీయ సంతతి టీచర్ శాంతి విశ్వనాథన్ ధైర్య సాహసాలను ఆ దేశ మీడియా కీర్తిస్తోంది. అనేక మంది విద్యార్థులను కాపాడటాన్ని ఆ దేశ మీడియా ప్రశంసింస్తోంది.
ఉన్మాది కాల్పులు జరుపుతున్న సమయంలో ఆమె సమయస్ఫూర్తి ప్రదర్శించి తన క్లాస్ రూమ్ విద్యార్థులను రక్షించారు. స్కూల్ లో రెండవ సారి అలారమ్ వినబడగానే టీచర్ శాంతి అలర్ట్ అయ్యారు. తన క్లాస్ రూమ్ లో ఉన్న విద్యార్థులను వెంటనే నేలపై పడుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత వెంటవెంటనే తలుపులు - ఆ రూమ్ కు ఉన్న కిటీకీలను మూసివేశారు. మరోవైపు ఉన్మాది నికోలస్ స్కూల్ లో రక్తపాతం సృష్టించాడు. అయితే స్వాట్ టీమ్ పోలీసులు వచ్చిన తర్వాత కూడా టీచర్ శాంతి తన క్లాస్ రూమ్ తలుపులు తెరిచేందుకు నిరాకరించింది. ఉన్మాది నికోలస్ తన క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడేమో అన్న ఉద్దేశంతో ఆమె తలుపులు తీయలేదు. అయితే స్వాట్ పోలీసులు ఆ తర్వాత డోర్లను ధ్వంసం చేసి విద్యార్థులను ఆధీనంలోకి తీసుకున్నారు. టీచర్ శాంతి విశ్వనాథన్ సమయస్ఫూర్తి వల్ల అనేక మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారని మీడియా కథనాలు వెలువరించింది.
కాగా, తుపాకీ చేతబట్టిన టీనేజర్...పాఠశాలలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 17మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఓ ఇండియన్-అమెరికన్ విద్యార్థి సహా 19మంది గాయపడ్డారు. వందల మంది చిన్నారులు ఇంకా ఆ భయం నుంచి తేరుకోలేకపోతున్నారు. పార్క్ లాండ్ లోని మార్జొరీ స్టోన్ మ్యాన్ డగ్లస్ హైస్కూల్ పాఠశాల ఆవరణలో ఎటుచూసినా రక్తపుమరకలే కనిపించాయి. కాల్పులకు పాల్పడిన నికోలస్ క్రజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పాఠశాల విద్యార్థి అయిన నికోలస్.. తనను స్కూల్ నుంచి తొలిగించారన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించారు.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ కాల్పులు జరిగాయి. లోపలికి వస్తూనే దుండగుడు గేటు దగ్గర ముగ్గురిని కాల్చిచంపాడు. ఆ వెంటనే బిల్డింగ్ ఫైర్ అలారంను మోగించాడు. దానిని ఫైర్ డ్రిల్ గా భావించిన విద్యార్థులు - ఉపాధ్యాయులు అంతా ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ద్వారానికి ఎదురుగా నిలబడిన దుండగుడు బయటకు వచ్చినవారిని వచ్చినట్టు కాల్చివేశాడు. భయపడిపోయిన విద్యార్థులు తిరిగి క్లాసుల్లోకి పరిగెత్తారు. ఈ కాల్పుల్లో 12మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు తర్వాత మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది. కాల్పుల్లో 15మంది వరకు గాయపడ్డారు. భారతీయ అమెరికన్ల పిల్లలు ఎక్కువమంది ఈ పాఠశాలలోనే చదువుతున్నారు. అయితే 9వ తరగతి చదువుతున్న ఇండో-అమెరికన్ విద్యార్థికి మాత్రం స్వల్పగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం స్కూల్లోనే దుండగుడిని పోలీసులు బంధించారు. స్వల్పగాయాలైన నిందితుడికి దవాఖానలో చికిత్స నిర్వహించారు. అనంతరం బ్రోవర్డ్ కౌంటీ పోలీస్ హెడ్ క్వార్టర్ కు అతడిని తరలించారు.