Begin typing your search above and press return to search.

ఆ రెండింటికి టీమిండియా ఇదే

By:  Tupaki Desk   |   20 Sep 2015 12:35 PM GMT
ఆ రెండింటికి టీమిండియా ఇదే
X
క్రికెట్ పండుగకు తెర లేవనుంది. దక్షిణాఫ్రియాతో స్వదేశంలో జరిగే వన్డే.. టీ20 సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించారు. కెప్టెన్ విషయంలో మార్పు ఉంటుందని రకరకాలుగా సాగిన అంచనాలకు బ్రేకులు వేస్తూ.. మహేంద్రసింగ్ ధోనీకే జట్టు పగ్గాలు అప్పజెప్పారు. దీంతో.. మూడు నెలల విరామంతో జట్టులోకి ధోని వచ్చినట్లు అయ్యింది. మొత్తం 5 వన్డే మ్యాచ్ లు ఆడుతున్నా.. ప్రస్తుతం ప్రకటించిన జట్టు మూడు వన్డే.. టీ20 మ్యాచ్ ల కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. తాజా జట్టులో ఇద్దరు కొత్త వారికి మాత్రం స్థానం దక్కింది. మిగిలిన వారంతా పాత కాపులే.

వన్డే.. టీ 20 సిరీస్ కు సంబంధించి ప్రకటించిన జట్లులో ఒక్క మార్పు మాత్రమే ఉంది. వన్డే జట్టులో గురుకీరత్ సింగ్ ఎంపికైతే.. టీ20లో మాత్రం అరవింద్ కు చోటు లభించింది. హర్బజన్ సింగ్ కు టీ 20లో స్థానం దక్కగా.. వన్డే జట్టులో మాత్రం చోటు దక్కలేదు.

టీమిండియా జట్టు విషయానికి వస్తే.. టీ20 జట్టులో..

= ధోని, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ.. సురేష్ రైనా.. అజింక్యా రహానే.. అంబటి రాయుడు.. స్టువర్ట్ బిన్నీ.. అక్షర పటేల్.. హర్భజన్ సింగ్.. అశ్విన్.. భువనేశ్వర్ కుమార్ మోహిత్ శర్మ.. ఎస్ అరవింద్

వన్డే టీమిండియా జట్టు..

= ధోని.. శిఖర్ ధవన్.. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ.. అంబటి రాయుడు.. సురేష్ రైనా.. అజింక్యా రహానే.. స్టువర్ట్ బిన్నీ.. అక్షర్ పటేల్.. గురుకీత్ సింగ్.. అమిత్ మిశ్రా.. భువనేశ్వర్ కుమార్.. ఉమేష్ యాదవ్.. మోహిత్ శర్మ