Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో టెక్కీ ప్రాణం బలి..

By:  Tupaki Desk   |   20 Jun 2018 4:28 AM GMT
అమెరికాలో మరో టెక్కీ ప్రాణం బలి..
X
అమెరికాలో మరో భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ప్రశాంత్ కుక్కడే అనే భారతీయ టెక్కీ తన బైక్ పై వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని ల్యూసివెల్లిలో జరిగింది.

ల్యూసివెల్లిలో ఉదయం 8 గంటలకు ఈ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ బైక్ పై వేగంగా వస్తుండగా.. కారు రోడ్డు క్రాస్ చేసింది. ఈ వేగానికి అదుపు కాకపోవడంతో కారును వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్పాట్ లోనే ప్రశాంత్ చనిపోయాడు.

ప్రశాంత్ అమెరికాలో ఫ్రంట్ ఎండ్ డెవలప్ మెంట్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో 4 సంవత్సరాలుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ప్రశాంత్ కు ఐటీ ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉంది. అయితే అతడు భారత్ లోని ఏ ప్రాంతం, ఏ రాష్ట్రానికి చెందిన వాడనే విషయాలు ఇంకా తెలియరాలేదు.