Begin typing your search above and press return to search.
ఇండియన్ ఐటీపై ట్రంప్ దాడి మొదలైపోయిందా!
By: Tupaki Desk | 30 Jan 2017 1:19 PM GMTసుమారు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను అరికట్టేందుకు నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ తీసుకోబోయే నెక్స్ట్ నిర్ణయం మరింత బలంగా తగలబోతుందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇండియన్ ఐటీ రంగానికి గట్టి దెబ్బ తగలొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం... హెచ్-1బీ వీసాలపై ట్రంప్ పడనున్నారని రిపోర్టులు వెలువడుతుండటమే! ఈ లెక్కప్రకారం ఈ వీసాలపై న్యాయబద్దంగా ఉంటున్న ఇమిగ్రేట్లపై కూడా కొరడా ఝుళిపించాలని ట్రంప్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి... "అమెరికన్ నిరుద్యోగుల కడుపు కొడుతున్న వీసా" అనే పాయింట్ లేవనెత్తనున్నారట ట్రంప్.
తాజాగా వోక్స్ డాట్ కాం రిపోర్టుల ప్రకారం వైట్ హౌస్ కు చెందిన నలుగురు ఎగ్జిక్యూటివ్ లు ఈ మేరకు రూపొందించిన డ్రాఫ్ట్ లు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ లీకైన డ్రాఫ్టు ల్లో.. లీగల్ ఇమిగ్రేషన్ ను పరిమితం చేయడం, విదేశీ వర్కర్ వీసా ప్రొగ్రాం ను బలపర్చడం వంటివి ఉన్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకున్న నిర్ణయం "అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు అనుమతి" ని కూడా ట్రంప్ తుంగలోకి తొక్కే చర్యలు కనిపిస్తున్నాయట!
ట్రంప్ తీసుకోబోయే ఈ కొత్త నిర్ణయాల వల్ల సైన్స్, ఐటీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ విద్యార్థులు మరికొన్ని రోజుల పాటు అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తూ రూపొందించిన "ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓటీపీ)" వర్తించకుండా పోయే అవకాశం ఉంది! ఈ క్రమంలో డిగ్రీ విద్యార్థులు మూడేళ్ల పాటు అమెరికాలో ఉండే హక్కును కలిగిఉన్న ఈ ఓటీపీ పొడిగింపు విషయంపై ట్రంప్ తీసుకోబోయే నిర్ణయంతో 1,65,918 మంది భారతీయ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతుంది. అయితే ఈ నిర్ణయాల విషయంలో అమెరికా-ఇండియా స్నేహం ఏమైనా భారతీయులకు అనుకూలంగా సహాయం చేయగలుగుతుందా.. లేక ట్రంప్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటె వందసార్లు నిర్ణయం తీసుకున్నట్లేనా అనేది వేచి చూడాలి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/