Begin typing your search above and press return to search.
రైలు ఎదురుగా సెల్ఫీ..ఇద్దరి ప్రాణాలు తీసింది
By: Tupaki Desk | 16 April 2016 10:16 AM GMTసోషల్ మీడియాలో అందరినీ ఆకర్షించేందుకు గాను చాలామంది రకరకాల ప్లేసుల్లో సెల్ఫీలు దిగడం.. సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టుకోవడం సాధారణమైంది. కొందరైతే సాహస కృత్యాలు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. అలాంటివారు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే సెల్ఫీమోజులో ప్రాణాలు పోగొట్టుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉండగా తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరు కుర్రాళ్లు సెల్ఫీ మోజులో రైలు కిందపడి మరణించారు.
రైలుకి ఎదురుగా వెళ్లి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో పట్టాలపై వేగంగా దూసుకొస్తున్న రైలుకి కొద్ది దూరంలో నించొని ఇద్దరు యువకులు సెల్ఫీకి ప్రయత్నించారు. రైలు సమీపంలోకి వచ్చినప్పుడు వెంటనే పక్కకు తప్పుకోవాలని అనుకున్నారు. కానీ, వారి అంచనాలు తప్పాయి. తప్పుకోవడానికి ఏమాత్రం వీల్లేకపోయింది. రైలు చక్రాల కింద పడి నలిగిపోయారు.
కాగా సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. గతంలో రాజమండ్రిలో ఆగి ఉన్న రైలు ఇంజినుపైకి ఎక్కి సెల్ఫీ దిగాలనుకున్న ఓ యువకుడు విద్యుత్ తీగలకు తగిలి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొండల అంచులు, రైల్వే ట్రాక్ లు - జలపాతాలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.