Begin typing your search above and press return to search.
సానియాకు అరుదైన గౌరవం .. దుబాయ్ 'గోల్డెన్ వీసా' మంజూరు !
By: Tupaki Desk | 16 July 2021 7:35 AM GMTభారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అరుదైన అవకాశాన్ని అందుకుంది. సానియా మీర్జాకు దుబాయ్ 'గోల్డెన్ వీసా' మంజూరైంది. సానియా మీర్జాతోపాటు ఆమె భర్త పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ లకు 10 సంవత్సరాల యుఎఇ గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఈ గౌరవ వీసాతో సానియా, ఆమె భర్త షోయబ్ మాలిక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పదేళ్ల పాటు నివసించేందుకు ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా , పాకిస్తాన్ లోని సియాల్ కోట్ స్థానికుడు షోయబ్ మాలిక్ 2010 లో వివాహం చేసుకున్నారు.
పాక్ స్టార్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను పెళ్లాడిన తర్వాత నుండి వారు దుబాయ్ లోనే నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇజాన్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, భారత్ నుంచి ఈ గౌరవ వీసా అందుకున్నవారిలో సానియా మీర్జా మూడో వ్యక్తి. గతంలో బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ లకు కూడా దుబాయ్ గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఇక తనకు యూఏఈ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కడం పట్ల సానియా సంతోషం వ్యక్తం చేస్తోంది. మొదటగా తాను దుబాయ్ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సానియా వెల్లడించింది.
అలాగే, దుబాయ్ పౌరసత్వ అధికార యంత్రాంగానికి, దుబాయ్ క్రీడల శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది. దుబాయ్ తనకు, తన కుటుంబానికి ఎంతో ఆత్మీయ దేశంగా భావిస్తానని సానియా వివరించింది. దుబాయ్ ని తన రెండో ఇల్లుగా భావిస్తానని, అత్యధిక సమయం ఇక్కడే గడిపేందుకు నిశ్చయించుకున్నామని , భారత్ నుంచి కొద్దిమందికే దక్కిన ఈ అవకాశం తనను కూడా వరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, త్వరలోనే టెన్నిస్, క్రికెట్ అకాడెమీలు స్థాపించాలన్న తమ ఆకాంక్షలకు ఈ అవకాశం ఎంతో ఉపకరిస్తుందని తెలిపింది. సానియా ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కు సిద్ధం అవుతోంది. ఆరు గ్రాండ్ స్లామ్ లతో సహా 42 టైటిళ్లు గెలుచుకున్న సానియా మిర్జా, ఒక డబ్ల్యుటిఎ సింగిల్స్ టైటిల్ ను దక్కించుకున్న రికార్డు ఉంది.
ఇదిలా ఉంటె, ఎక్కువ కాలం పాటు అక్కడే నివాసం ఏర్పర్చుకునేందుకు గోల్డెన్ వీసాను 2019లో ప్రవేశ పెట్టింది దుబాయ్. ఇందులో జాతీయ స్పాన్సర్ అవసరం లేకుండా యుఎఇలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ వ్యాపారం మీద 100 శాతం యాజమాన్యం హక్కులను పొందవచ్చు. ఆ దేశంలో నివసించడానికి పని చేయడానికి, అధ్యయనం చేయడానికి విదేశీయులకు వీలు కల్పించింది. ఈ వీసాలు ఐదు లేదా పదేళ్ల కాల వ్యవధి తర్వాత ఆటోమెటిక్‌గా గోల్డెన్ వీసాను రెన్యూవల్ చేస్తారు. ఈ గోల్డెన్ వీసా పొందిన ఇతర క్రీడాకారులలో ఫుట్ బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ ఫిగో, టెన్నిస్ ప్రపంచ నంబర్ 1 నోవాక్ జొకోవిచ్ ఉన్నారు. వారి తర్వాత ఇలాంటి అరుదైన అవకాశన్ని సానియా మీర్జా దంపతులు దక్కించుకున్నారు.