Begin typing your search above and press return to search.
సాఫ్టువేర్ కంపెనీలకు నాయకులైతే..
By: Tupaki Desk | 10 Sep 2015 7:06 AM GMT ఐటీ కంపెనీలు... ప్రముఖ సంస్థలకు సీటీఓ, సీఈఓ పదవులంటే చాలా కీలకం.. సంస్థ మొత్తం వారి కనుసన్నల్లోనే నడుస్తుంది. కీలక నిర్ణయాలన్నీ వారివే అవుతాయి.. సంస్కరణల పథమైనా.. సంప్రదాయ పథమైనా ఏదో ఒక మార్గంలో కంపెనీని పరుగులు తీయించడమే పరమావధిగా వారు పనిచేస్తుంటారు. కంపెనీని ముంచినా తేల్చినా వారిదే ఆ ఘనత, బాధ్యత. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్టు సంస్థకు తెలుగోడు సత్య నాదెళ్ల సీఈఓగా ఉన్నారు... గూగుల్ సీఈఓ గానూ భారతీయుడే ఉన్నారు. సుందర్ పిచ్చై ఆ పదవిలో ఉన్నారు. ఇక సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ పగ్గాలు కూడా తెలుగు మహిళ పద్మశ్రీ వారియర్ కు దక్కుతాయని అంటున్నారు.
... మరి మన పొలిటీషియన్లు ఇలా ఐటీ కంపెనీలకు సీటీఓలు, సీఈఓలుగా ఉంటే ఎలా ఉంటుంది..? ఎప్పుడైనా ఆలోచించారా..?లేదు కదా.. సరదాగా ఓసారి ట్రై చేయండి.
నరేంద్ర మోడీ: అత్యధిక ఉత్పాదకత సాధిస్తాననే ఉద్యోగి ఈయన.. పొద్దున్నే ఆఫీసుకు వచ్చేసి అర్ధరాత్రి వరకు పనిలోనే మునిగిపోయే తత్వం. పెళ్లాం పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆఫీసే లోకం.. అయితే... ఇదంతా బాగానే ఉన్నా ఈయనతో కొన్ని సమస్యలూ ఉన్నాయి... అంతా తానే అయి నడిపించాలనుకుంటారు.. అన్ని టీం లకూ తానే టీం లీడర్ కావాలనుకుంటారు. అంతేకాదు.. ఎక్కువగా విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. కంపెనీ బిజినెస్ లేని దేశాలకు.. అసలు క్లయింట్ లే లేని చోట్లకూ కూడా వెళ్తుంటారు. అదే ఎవరికీ అర్ధంకాని విషయం.
రాహుల్ గాంధీ: ఇండస్ట్రీలో ఎక్స్ పీరియన్స్.. తక్కువే అయినా చాలా తక్కువ కాలంలోనే మంచి పొజిషనుకు వచ్చేశారు. ఒక్క ప్రాజెక్టూ సక్సెస్ కాకపోయినా సొంత కంపెనీ కావడంతో సీనియర్ లెవల్ కు వచ్చేశారు. క్లయింట్ లు ఎక్కడున్నా సరే... ఎంత చిన్న గల్లీలో ఉన్నా ఒక్కోసారి అక్కడకు వెళ్తుంటారు. అక్కడ కచ్చితంగా ఫొటోలు దిగి పేపర్ లలో కవరయ్యేలా చూసుకుంటారు. ప్రత్యర్థి కంపెనీ సీఈఓ మోడీ ఎంత మంచి ప్రాజెక్టు చేసినా అది నేనెప్పుడో చేశాను అనడం ఈయనకు అలవాటు.
అరవింద్ కేజ్రీవాల్: ఈయన ట్రబుల్ షూటర్ డెవలపర్... పెద్దపెద్ద ప్రాజెక్టులు అందుకోవాలని కలలు కని.. వచ్చిన అవకాశాలు చేజార్చుకున్న సీటీఓ.. మళ్లీ ఏదోలా అవకాశం పొంది నానా కష్టాలు పడుతూ కంపెనీ నడిపిస్తున్నాడు. మోడీ కంపెనీతో నిత్యం గొడవపడుతుంటాడు. గతంలో సాఫ్టువేర్ ను డెవలప్ చేసినప్పుడు టెస్టర్లు లోపాలు చూపించగా వారికి వ్యతిరేకంగా ధర్నా చేశాడు... ఇంకెప్పుడూ సాఫ్టువేర్ తయారు చేయనని అలిగాడు... మళ్లీ ఏమనుకున్నాడో ఏమో కానీ .. ఇంకెప్పుడూ ఇలా అలగనని చెప్పి మళ్లీ సాఫ్టువేర్ తయారీ మొదలుపెట్టాడు.
చంద్రబాబు నాయుడు: స్వయంగా మంచి సాప్టువేర్లు తయారుచేయగల సత్తా ఉన్నోడే కానీ ఎప్పుడూ ఆ కంపెనీ సాఫ్టువేరులాంటిది తయారుచేస్తా... ఈ కంపెనీ సాఫ్టువేర్ వంటిది తయారుచేస్తాను అంటూ కాపీ మాస్టర్ లా మాట్లాడుతారు. గతంలో తాను పనిచేసిన కంపెనీలన్నీ తన వల్లే పెద్దవయ్యాయని ఇప్పటికీ చెబుతుంటారు. పక్క కంపెనీ సీఈఓ ఈయన్ను పదేపదే గిల్లుతూ రెచ్చగొడుతూ ఉంటే ఉడుక్కుంటూ వార్నింగులు ఇస్తుంటారు.
జగన్ : తన తండ్రి రాజశేఖరరెడ్డి తయారు చేసిన సాఫ్టువేర్ ల క్రెడిట్ వల్ల ఈయన సొంత కంపెనీ పెట్టుకుని సీఈఓ అయ్యారు. చంద్రబాబు కు పోటీ కంపెనీ ఈయనది... ఎప్పుడు ఏ సాఫ్టువేర్ తయారుచేస్తారో ఎవరికీ తెలియదు.