Begin typing your search above and press return to search.

డేటింగ్ యాప్‌ లో మ‌నోళ్లు సృష్టించిన రికార్డ్ ఇది

By:  Tupaki Desk   |   11 Dec 2018 1:30 AM GMT
డేటింగ్ యాప్‌ లో మ‌నోళ్లు సృష్టించిన రికార్డ్ ఇది
X
కాలం మారుతోంది. అభిమారులూ మారుతున్నాయి. ఒక‌నాడు వింత అనుకున్న‌ది...నేడు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. అలాంటి వాటిల్లో ఒక‌టి...వివాహేత‌ర సంబంధాలు. ఒక‌నాడు చిత్రంగా, త‌ప్పుగా చూసే ఈ బంధాలు నేడు కామ‌న్ అయ్యాయి. అయితే, ఈ `కామం`లోని కామ‌న్ ట్రెండ్ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది!. అన్నింట్లో ముందుండే పురుషులే...ఇందులో తోపుల‌ని తేలింది!! ఇండియాలోని డేటింగ్‌ యాప్స్‌ ని మగవాళ్లే ఎక్కువ వాడుతున్నారని రీసెంట్ గా జరిగిన ఓ సర్వేలో తేలింది.

దాదాపు ఇరవై వేల మంది భార‌తీయ‌ యూజర్లను ‘వూ’అనే ఆన్‌ లైన్‌ డేటింగ్‌ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలో డేటింగ్‌ యాప్స్‌ వాడుతున్న వాళ్లలో 24 శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా, పురుషులు 76 శాతం ఉన్నారు. అంటే స్త్రీల కంటే పురుషులు దాదాపు మూడురెట్లు ఎక్కువగా ఉన్నారు. యూజర్లు సగటున రోజూ 45 నిమిషాలు ఈ యాప్స్‌ వాడుతున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది మంచి సంబంధాలు కొనసాగించేందుకే యాప్స్‌ ని వాడుతుండటం విశేషం. కొత్త వాళ్లను కలుసుకునేందుకు, సన్నిహితుల్ని పెంచుకునేందుకే ఎక్కువగా ఈ యాప్స్‌ వాడుతున్నారు. 38 శాతం మంది మంచి సంబంధాల్ని నెలకొల్పేందుకు, 28 శాతం మంది ఇతర ప్రాంతాల వాళ్లను పరిచయం చేసుకునేందుకు, 17 శాతం మంది తమ సన్నిహితుల్ని పెంచుకునేందుకు యాప్ ను యూజ్ చేస్తున్నట్లు తేలింది. మహిళా యూజర్లు ఒకేసారి ముగ్గురు మగవారితో చాట్‌ చేస్తుండగా, మగవాళ్లు మాత్రం అంతకంటే ఎక్కువ మంది మహిళలతో చాట్‌ చేస్తున్నారని వెల్ల‌డైంది.