Begin typing your search above and press return to search.

మనమ్మాయి ఆ సంపన్న దేశానికి రక్షణమంత్రి

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:33 AM GMT
మనమ్మాయి ఆ సంపన్న దేశానికి రక్షణమంత్రి
X
భారతీయులు.. భారత సంతతి ప్రపంచ వ్యాప్తం గా పలు కీలక స్థానాల్లో ఉన్నారని చెప్పాలి. ఈ విషయం లో ప్రపంచానికి పెద్దన్న అమెరికా కు ఉపాధ్యక్షురాలి గా వ్యవహరిస్తున్న కమలా హ్యారీస్ అందరి కంటే అత్యున్నత స్థానం లో ఉన్నారని చెప్పాలి.

ఇప్పుడు మరో మహిళ అలాంటి స్థానాన్నే సొంతం చేసుకుంది. కాకుంటే అమెరికా లో కాదు.. కెనడా లో. అవును.. భారత సంతతి కి చెందిన అనిత ఆనంద్ అనే మహిళ కెనడా రక్షణ మంత్రి గా నియమితులయ్యారు. గతంలో భారత సంతతికి చెందిన హర్జిత్ సజ్జన్ రక్షణ మంత్రి గా వ్యవహరించేవారు. ఆయన తర్వాత ఆ కీలక మంత్రిత్వ శాఖ కు మనమ్మాయే ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం గా చెప్పాలి.

కెనడా రక్షణ మంత్రి గా సుదీర్ఘకాలం గా పని చేసిన హర్జిత్ సజ్జన్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అన్నింటి కి మించిన అతడి మీద వచ్చిన మిలటరీ సెక్సువల్ మిస్ కండక్ట్ మీద ఆయన వ్యవహరించిన తీరు పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను రక్షణ మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానం లో భారత సంతతికి చెందిన అనిత ను నియమించటం వల్ల మిలటరీ సెక్సువల్ మిస్ కండక్ట్ బాధితుల కు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

ఆసక్తికర మైన విషయం ఏమంటే.. హర్జిత్ మీద ఆరోపణలు పెరిగిపోవటం.. ఈ నేపథ్యం లో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి.. అనిత కు ఆ కీలక పదవిని అప్పజెబుతారని కెనడా మీడియా గడిచిన కొద్ది రోజులు గా చెబుతోంది. ఇందుకు తగ్గట్లే.. తాజా పరిణామాలు చోటు చేసుకోవటం విశేషం. ఏమైనా భారత సంతతికి చెందిన మరో మహిళ కీలక పదవిని చేపట్టటం హర్షించాల్సిన అంశమే.