Begin typing your search above and press return to search.
బరువు తగ్గినందుకు '32 గ్రాములు' బంగారం
By: Tupaki Desk | 17 March 2015 6:02 AM GMTబంగారం కోసం బరువు తగ్గుతారా? ఆశ్చర్యంగా అనిపించినా.. బంగారం కాకపోయినా.. పోటీలో గెలవాలన్న ఉద్దేశ్యంతో ఒక మహిళ తన బరువును తగ్గించుకొని అందరికి ఆశ్చర్యంలో ముంచెత్తటమే కాదు.. 32గ్రాముల బంగారాన్ని సొంతం చేసుకుంది.
దుబాయ్ మున్సిపాలిటీ ఒక చిత్రమైన పోటీ నిర్వహించింది. ఇంతకీ ఈ పోటీ ఏమిటంటే.. ఈ పోటీలో పాల్గనే వారు నిర్ణీత వ్యవధిలోపు తమ శరీర బరువును తగ్గించుకోవాలి. ఒక కిలో బరువు తగ్గించుకుంటే ఒక గ్రాము బంగారం చొప్పున ఇస్తారు. ఎవరైతే ఎక్కువ బరువు తగ్గుతారో వారేఈ పోటీలో విజేతలు.
ఈ పోటీలో దాదాపుగా ఏడు వేల మంది దాకా పోటీ పడ్డారు. కానీ.. విజేతగా మాత్రం భారతీయ మహిళా వ్యాపారి విజయం సాధించారు. పోటీలో పాల్గనే సమయానికి ఆమె బరువు 96 కేజీలు. రెండు నెలల వ్యవధిలో ఆమె ఏకంగా 32 కేజీలు తగ్గి నాజూగ్గా తయారయ్యారు.
కఠినమైన వ్యాయామం.. పక్కా డైట్ ప్లాన్‌తో పాటు.. ఆరోగ్యంగా ఉండాలన్న పట్టుదలతో తానీ విజయాన్ని సాధించినట్లు శారదా సెరిగర చెబుతున్నారు. పోటీలో పాల్గనే సమయానికి బద్దుగా ఉన్న ఆమె.. విజేతగా నిలిచే నాటికి నాజూగ్గా తయారు కావటం పలువుర్ని ఆకర్షించింది. ఆమె తగ్గిన 32 కేజీలకు 32 గ్రాములు సొంతం చేసుకొన్నారు. అదే సమయంలో ఈ పోటీలో చిన్నారుల విభాగంలో భారత్‌కు చెందిన సోమేశ్ చక్రవర్తి 12 కేజీలు తగ్గి విజేతగా నిలిచారు.