Begin typing your search above and press return to search.
అమెరికన్ జాత్యాహంకారంపై కోర్టుకెక్కిన భారతీయ మహిళ
By: Tupaki Desk | 24 Sep 2022 5:18 AM GMTఅమెరికాలో జాత్యాహంకార దాడులు ఎక్కువవుతున్నాయి. భారతీయులపై అక్కడి అమెరికన్లు దాడులు, మాటలతో బూతుల పర్వం కొనసాగిస్తున్నారు. భారతీయులను చులకనగా చూస్తూ అవహేళన చేస్తున్నారు. గత నెలలో ఎస్మెరాల్డా ఆప్టన్ అనే మహిళ డల్లాస్ పార్క్‌వే వెలుపల ఉన్న అరవై వైన్స్ ప్లానో రెస్టారెంట్ వద్ద రాత్రిపూట నలుగురు భారతీయ అమెరికన్ మహిళల బృందాన్ని జాత్యాహంకార దుర్భాషలాడారు. కొట్టడానికి యత్నించారు... బెదిరించారు..
ఆ భారతీయ మహిళ డాక్టర్ బిదిషా రుద్ర ఇప్పుడు దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అమెరికన్ మహిళపై సివిల్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్లానో పోలీసులు ఎస్మెరాల్డా అప్టన్ అరెస్టు చేసి ఇప్పటికే జైలుకు పంపారు. ఆమె శారీరకంగా గాయపరిచిందని.. తీవ్రవాద బెదిరింపులకు కారణమైందన్న రెండు దుష్ప్రవర్తన ఆరోపణలను ఎదుర్కొంటోంది.
అప్టన్ ప్రవర్తనను ప్లానో పోలీసులు 'క్రైమ్ ఎగైనెస్ట్ పర్సన్స్' ద్వేషపూరిత నేరంగా రిపోర్టులో పేర్కొన్నారు. దీని అర్థం అదనపు ఆరోపణలుగా ధ్రువీకరించారు. దావావేసిన భారతీయ మహిళ డా. బిదిషా ఏమి జరిగిందో చూసి చలించిపోయానని.. ఇప్పుడు ఇలాంటి మరిన్ని దాడులకు భయపడుతున్నానని వాపోయింది.
ఆమె అప్టన్‌పై న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించుకుంది. అయితే, దావాలో అప్టన్‌కు వ్యతిరేకంగా ఏమి డిమాండ్ చేశారో ఇప్పటికీ వెల్లడించలేదు.
ఆప్టన్ తనకు భారతీయులు అంటే ఇష్టం లేదని.. జాత్యహంకార దాడి చేయడమే కాకుండా, సంఘటనను రికార్డ్ చేస్తున్న మహిళల్లో ఒకరిని కొట్టడానికి కూడా వెళ్లింది. అప్టన్ మహిళలను కాల్చివేస్తానని బెదిరించింది.. అప్టన్ విషయానికొస్తే, ఆమె ఇప్పుడు ప్లానో జైలు గదిలో జైలు శిక్ష అనుభవిస్తోంది.
టెక్సాస్‌లోని ప్లానోకు చెందిన ఒక అమెరికన్ మహిళ.. భారతీయ మహిళపై దాడి చేయడమే కాకుండా జాత్యంహకార బెదిరింపులకు పాల్పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమెరికన్ మహిళను అరెస్టు చేశారు.ప్లానోకు చెందిన ఎస్మెరాల్డా అప్టన్ ఈ దాడి చేసింది. భారతీయ మహిళపై శారీరకంగా గాయపరిచినందుకు.. తీవ్రవాద బెదిరింపులకు పాల్పడినందుకు ఆమె అరెస్ట్ అయ్యింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.